జయము జయము ఇక జనులాల
Jayamu Jayamu Ika Janulala: జయము జయము ఇక జనులాల అన్నమాచార్య కీర్తన. ఇక్కడ అన్నమాచార్య భగవానుడు నరసింహ స్వామి రాక్షస రాజైన హిరణ్యకశిపుడిని ఎలా చంపాడో మరియు చంపిన తరువాత ఉగ్ర రూపుడైన శ్రీ మహావిష్ణువు ఎక్కడ నివసించాడో వివరిస్తున్నాడు.
శ్రీ మహావిష్ణువుకు జయము జయము. రాక్షసులు నశించారు కనుక ఇక మనమందరం సుఖంగా, ప్రశాంతంగా జీవించవచ్చని కవి ఈ పాటలో చెబుతున్నాడు.
జయము జయము ఇక జనులాల సాహిత్యం అర్థం:
పల్లవి: ఓ ప్రజలారా! జయము జయము, భయాలు పోయి మనం బ్రతికి బయటపడ్డాము.
చరణం 1: గొప్పవాడైన శ్రీ నరసింహమూర్తి స్తంభము నుండి వచ్చి రాక్షసులను చంపడం వలన రాక్షసులు లేని భూమి వెలసింది. అధర్మము నశించి భూమి మీద భారం తగ్గింది. మునులు తాము తపస్సు చేసే స్థానాలను విడిచిపెట్టి వారి వారి ఆశ్రమాలకు వెళ్లిపోయారు.
చరణం 2: గంభీరమైన విష్ణుమూర్తి గద్దెపై నిలబడి హిరణ్యకశిపుడిని భాదించాడు (చంపాడు). నిత్యం పూజించే ప్రహ్లాదుడి అన్ని కోరికలను మన్నించిన ఆ విష్ణుమూర్తిని, శివుడు మరియు బ్రహ్మదేవుడు కూడా పూజించారు.
చరణం 3: అహోబిలంలో వెలసిన నృసింహస్వామి, లక్ష్మీదేవిని తన పక్కన కలవాడై, తమ పర భేదాలు లేకుండా, ఈ లోకంలోనూ పరలోకంలోనూ మరియు వేంకటగిరిని విహరించుచు అందరికి అన్నివేళలా శుభములు కలుగునట్లు ఆశీర్వదించుచున్నాడు.
Click here for pdf జయము జయము ఇక జనులాల
Click here for English
చిట్క:
సహనం: కొత్తది నేర్చుకోవడానికి సమయం పడుతుంది; మీకు ఇష్టమైన సంగీత విద్వాంసులు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సంవత్సరాలు గడిపారు, తక్కువ సమయంలో దానిని మీరు నేర్చుకోలేకపోతే నిరాశ చెందకండి. నిరుత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తే, ఊపిరి పీల్చుకోండి, వేగాన్ని తగ్గించి మళ్లీ ప్రయత్నించండి లేదా విరామం తీసుకోండి. సంగీతం నేర్చుకోవడానికి సాధన అవసరం, సాధన చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఓపిక అవసరం.
వేరొక పాటలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
← ముందు తరువాయి →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏻 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.