సాయంకాల సమయములో
(లక్ష్మీదేవి హారతి పాట)
Sayamkala samayamulo lyrics in Telugu with meaning: సాయంకాల సమయములో పాట లక్ష్మీ దేవి మీద వ్రాయబడింది. ఇక్కడ కవి ఆ దేవిని వివిధ పేర్లతో పొగుడుతూ, ఆమె అలంకారాలను వర్ణిస్తూ, ఆమె దివ్య మంగళ స్వరూపాన్ని కన్నులార వీక్షించమని చెప్తున్నారు.
పాటలోనే సంధ్యా దీపం గురించి ప్రస్తావన వచ్చినందున, సాయంకాలం దీపం వెలిగించి ఆ సిరులనిచ్చే శ్రీలక్ష్మిని మనసులో నింపుకొని ఈ పాటను గానం చేస్తే ఎంతో బావుంటుంది. అది శ్రావణ శుక్రవారమైతే ఆ అనుభూతే వర్ణనాతీతం.
సాయంకాల సమయములో – సాహిత్యం అర్థం:
పల్లవి: సాయంకాల సమయంలో దీపారాధన చేస్తే మనకు వరాలను ఇచ్చే ఆ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువుంటుంది.
చరణం 1: కాళ్లకు గజ్జెలు కట్టుకొని, మెడలో హారంతో మెరిసిపోతున్న ఆ శ్రీ మహాలక్ష్మి, పిలిచిన వెంటనే పలికి మనం అడిగిన వరాలన్నీ ఇస్తుంది.
చరణం 2: మనం ప్రముఖంగా పూజించే ఆదిలక్ష్మి, ధనాన్ని ఇచ్చే ధనలక్ష్మిగా, ధాన్యాన్ని ఇచ్చే ధాన్యలక్ష్మిగా, వరాలను ఇచ్చే వరలక్ష్మిగా, సంతానాన్ని ఇచ్చే సంతానలక్ష్మిగా, ధైర్యాన్ని ఇచ్చే ధైర్యలక్ష్మిగా, విజయాలను చేకూర్చే విజయలక్ష్మిగా, విద్యను అనుగ్రహించే విద్యాలక్ష్మిగా, గజలక్ష్మిగా ఇలా వివిధ రూపాలలో మనకు దర్శనమిచ్చి మన కొంగు బంగారమై, కోరికలను తీర్చే అమృతవర్షిణిలా మన ఇంట కొలువుంటుంది.
చరణం 3: మనమందరం కలిసి జాజులు, మల్లెలను ఆ దేవికి సమర్పించి, ఆ శ్రీనివాసుని సతీమణైన శ్రీదేవి రూపాన్ని కన్నులారా తిలకించి సేవించుకుందాం పదండి.
చరణం 4: ఆమె ధరించిన వజ్ర కిరీటాన్ని, ముత్యాలహారాన్ని, నాగాభరణాన్ని, ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి ధన్యులుకండి.
Click here for pdf సాయంకాల సమయములో (Sayamkala samayamulo lyrics in Telugu)
Click here for English
చిట్క:
సంగీత శిక్షణ ప్రారంభం: కర్ణాటక సంగీతం మొదటి (స్వరాలు – Basics) నుంచి నేర్చుకోవాలని అనుకునేవారు గురువు దగ్గర అభ్యాసం చెయ్యడం మొదలుపెడతారు, అలా కాకుండా కొంతమంది కేవలం పాటలు మాత్రమే నేర్చుకోవాలని అనుకుంటారు.
పాటలు నేర్చుకోవాలన్నా గురువు దగ్గర అభ్యాసం చేయడం అనేది మంచి పద్ధతి అలా కుదరని వారికి ఎక్కడ నుండి మొదలుపెట్టాలో తెలియక ఇబ్బంది పడతారు, అలాంటి వారు….
ముందుగా చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకోండి, తరువాత చిన్న తరహా పాటలు (ఒక పల్లవి మరియు చరణం కలవి), తరువాత పెద్ద పాటలు (ఎక్కువ చరణాలు కలిగినవి) నేర్చుకోండి.
అభ్యసించే ప్రతీదీ ఖచ్చితంగా రాసుకోవాలి, అప్పుడే ఏమి నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం అనే దానిమీద అవగాహన ఉంటుంది.
ఎలాంటి శ్లోకాలు, పాటలు నేర్చుకోవాలి??
ఏదైనా పండగ లేదా శుభకార్యం రాబోతుందనుకోండి దానికి సంబంధించిన వాటితో మొదలుపెట్టండి. ఒకసారి మొదలు పెట్టాక వదలకుండా నేర్చుకోవడం అనేది జరిగితే తరువాత ఏమి నేర్చుకోవాలి?? అని ఆలోచించాల్సిన అవసరం ఉండదు, మీ సంగీత ప్రయాణం సాగుతునే ఉంటుంది.
చివరగా మీరు నేర్చుకునేదానిమీద పట్టు సాధించాలంటే మాత్రం గురువుని చేరుకోవాల్సిందే…
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← అయి గిరినందిని – మహిషాసుర మర్దిని స్తోత్రం శీతాద్రి శిఖరాన →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.