శీతాద్రి శిఖరాన
(అమ్మవారి హారతి పాట)
Sheetadri shikharana lyrics in Telugu with meaning: శీతాద్రి శిఖరాన పాట శ్రీ బేతవోలు రామబ్రహ్మాం గారు పార్వతీ దేవి మీద వ్రాయగా, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు గానం చేశారు.
ఇక్కడ కవి ఆ దేవి పాదాలను మొదలుకొని ఆమె కురుల వరకు, ఆ తల్లి అలంకారాలను, అందాన్ని వర్ణిస్తూ ఆమె నిలువెత్తు స్వరూపానికి నీరాజనాలు అర్పిస్తున్నారు.
శీతాద్రి శిఖరాన – సాహిత్యం అర్థం:
పల్లవి: హిమాలయ పర్వత శిఖరం మీద పగడాలు పొదిగినట్లుగా అనిపించే మా తల్లి పార్వతీ దేవి యొక్క ఎర్రని పారాణి అద్దిన పాదాలకు నిండైన భక్తితో హారతి ఇస్తున్నాము.
చరణం 1: యోగులకు ప్రభువైన శివుని మదిలో మ్రోగుతున్న మా తల్లి పార్వతీ దేవి యొక్క అందమైన కాలి బంగారు అందెలకు భక్తితో సందడి చేస్తూ హారతి ఇస్తున్నాము.
చరణం 2: చంద్రుడిని అలంకారంగా ధరించిన శివుని మనసులో అనురాగ భావాలను కలిగించే మా తల్లి పార్వతీ దేవి యొక్క రాగాలు పలికించే గాజులకు, ఆ శబ్దానికి అనుగుణంగా మా చేతులతో భక్తిగా భజనలు చేస్తూ హారతి ఇస్తున్నాము.
చరణం 3: మనుషుల మనసులలో ఉండే చీకట్లను తొలగించే మా తల్లి పార్వతీ దేవి యొక్క ముత్యాలు కురిపించే నవ్వులకు, భక్తితో నృత్యాలు చేస్తూ హారతి ఇస్తున్నాము.
చరణం 4: ప్రకాశవంతమైన చెంపల మీద ఖాళీ లేకుండా వ్యాపించి ఉన్న మా తల్లి పార్వతీ దేవి యొక్క శోభనమాయమైన రత్నాలు పొదిగిన ముక్కెరకు, భక్తిని చూపిస్తూ హారతి ఇస్తున్నాము.
చరణం 5: ప్రజలందరిని చిన్నపిల్లలలాగ చేసి రక్షించే మా తల్లి పార్వతీ దేవి యొక్క చల్లని ప్రేమపూరిత చూపులకు, భక్తి కనిపించే విధంగా హారతి ఇస్తున్నాము.
చరణం 6: ఆకాశంలో కనిపించే సూర్యుని ప్రతిబింబము లాగా అనిపించే మా తల్లి పార్వతీ దేవి యొక్క పరిపూర్ణంమైన కుంకుమ బొట్టుకు, అధికమైన భక్తితో హారతి ఇస్తున్నాము.
చరణం 7: తేనెటీగపిల్లలు లాగా గాలికి అటు ఇటు కదులుతున్న మా తల్లి పార్వతీ దేవి యొక్క ఒత్తైన కేశ సంపదకు, భక్తి భావంతో హారతి ఇస్తున్నాము.
చరణం 8: ఈ లోకమంతటిచేత ఇష్టపడబడుతున్న, సర్వేశ్వరుడైన ఈశ్వరుని ఇంటి ఇల్లాలైన మా తల్లి పార్వతీ దేవి యొక్క సాష్టాంగ రూపానికి, విలువైన భక్తితో హారతి ఇస్తున్నాము.
Click here for pdf శీతాద్రి శిఖరాన – సాహిత్యం (Sheetadri shikharana lyrics in Telugu)
Click here for English
చిట్క:
మంచి అనుభూతి పొందడానికి సంగీతం నేర్చుకోండి: నా పనిలో నేను ఎక్కువగా ఆనందించే విషయం ఏమిటంటే, సంగీతం ద్వారా మనిషిలో మార్పు రావడం చూసే అవకాశం.
విద్యార్థులు నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు కొన్నిసార్లు దిగులుగా, అలిసిపోయినట్లుగా కనిపిస్తారు. కానీ ఒక అరగంట క్లాస్ తరువాత చూస్తే వారు ప్రశాంతంగా మరియు సంతోషంగా కనిపిస్తారు.
ఇలాంటి మార్పుకు ఒక కారణం ఎండార్ఫిన్. పాడటం వలన మీ మెదడులో మంచి అనుభూతిని కలిగించే ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి, ఇది మిమ్మల్ని సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← సాయంకాల సమయములో శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరి →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.