NarayaNa mantram srimannarayaNa bhajanam lyrics in Telugu with meaning

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

NarayaNa mantram srimannarayaNa bhajanam lyrics in Telugu with meaning: నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం పాట 1967వ సంవత్సరంలో విడుదలైన భక్త ప్రహ్లాద సినిమా కొరకు సీనియర్ సముద్రాల గారు రచించగా, సాలూరి రాజేశ్వర రావు గారు సంగీతం అందించి, సుశీల గారిచే పాడించారు.

ఈ చిత్రం ప్రముఖ తారాగణం, హిరణ్యకశిపుడిగా ఎస్వీ రంగారావు గారు, అతని భార్య లీలావతిగా అంజలీదేవి గారు మరియు ప్రహ్లాదునిగా బేబీ రోజారమణి నటించి మెప్పించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు నారదునిగా నటించి తన నటనా జీవితాన్ని ఈ సినిమాతోనే ప్రారంభించారు.

ఈ పాట నేపథ్య కథ: రాక్షస రాజు హిరణ్యకశిపుడు, విష్ణు భక్తుడైన తన కుమారుడు ప్రహ్లాదుడి మనసు విష్ణుమూర్తి నుంచి మరల్చడానికి గురుకులానికి పంపిస్తాడు. అయితే ప్రహ్లాదుడు గురుకులంలో ఇతర విద్యార్థులకు విష్ణువు గురించి ఈ పాట ద్వారా బోధిస్తాడు.

మరింత అవగాహన కోసం “భక్త ప్రహ్లాద (1967)” చిత్రాన్ని తప్పక చూడండి. ఇది చాలా మంచి సినిమా, మీరు తప్పక ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను.

NarayaNa mantram shreemannarayaNa bhajanam lyrics in Telugu
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం సాహిత్యం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం – సాహిత్యం అర్థం:

పల్లవి: నారాయణునికి నమస్కారం. నారాయణ మంత్రం జపించి, ఆ శ్రీమన్నారాయణుని పాటలు పాడండి, ఈ భూమి మీద తాత్కాలికంగా ఏర్పడిన బంధాల నుంచి ముక్తిని పొంది మోక్షం చేరుకోవాలంటే ఇదే మార్గం.

చరణం 1: శ్రీహరిని చేరుకోవడానికి, మీరు మీ శ్వాసను బలవంతంగా ఆపి కష్టపడి తపస్సు చేయాల్సిన అవసరం లేదు లేదా జంతువులను బాధపెట్టి, బలి ఇచ్చి, పూజలు, యఙ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకుని ఆ మాధవుడిని స్మరించిన చాలు.

చరణం 2: ఆ శ్రీమన్నారాయణుడే మనకు తల్లి, తండ్రి, గురువు, జ్ఞానం, ఔషధం, యజ్ఞం, మోక్షం మరియు దాత అన్నీ.

Click here for pdf నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం సాహిత్యం (NarayaNa mantram srimannarayaNa bhajanam lyrics in Telugu)

Click here for English

అమెరికాలోని ఇల్లినోయిస్ రాష్ట్రం, చికాగోలో నివసిస్తున్న 6 సంవత్సరాల వయస్సు గల నా విద్యార్థిని సాన్వి తన ‘తెలుగు సంఘం- దీపావళి వేడుకల్లో’ “నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ భజనం” పాట పాడింది. ఆమె పుట్టింది అమెరికాలో అయినప్పటికీ తెలుగు పదాలను వీలైనంత సరిగ్గా ఉచ్చరించడానికి తన వంతు ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నాన్ని మరియు అంకితభావాన్ని నేను అభినందిస్తున్నాను.

దేవుడు నిన్ను చల్లగా చూడాలి సాన్వి. ఇంకా నువ్వు ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

నీ గురువు,

అంజలి సుధీర్.

చిట్క:

సంగీతాన్ని ఎక్కువగా వినండి, మీరు వింటున్న పాట మీకు తెలిసిన భాషలో లేనప్పటికీ, మీరు పాటలోని లయను, పాడేవారి మెళుకువలు తప్పనిసరిగా గ్రహించాలి. వివిధ రకాల సంగీతాన్ని, వాయిద్యాలను వినండి; వాటి మధ్య తేడాలను గుర్తించడానికి ప్రయత్నించండి.

సంగీతం ఒక సముద్రం; సంగీతంలోని మాధుర్యాన్ని ఆశ్వాదించడానికి మీరు వీలైనంత లోతుగా వెళ్లాలి. సంగీత సాగరం లోతులో, ఒక అందమైన ప్రపంచం దాగి ఉంది, చాలా పాటలు వినడం, సాధన చేయడం మరియు పాడడం ద్వారా ఆ సౌందర్యాన్ని చూసే అవకాశాన్ని పొందడానికి ప్రయత్నించండి.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….

శ్లోకాలు                                                                                                      తరువాత

కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽  సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు