Shivudu tandavamu cheyunamma lyrics in Telugu with meaning

శివుడు తాండవము చేయునమ్మ
(శివుని పాట)

Shivudu tandavamu cheyunamma lyrics in Telugu with meaning: శివుడు తాండవము చేయునమ్మ పాట తెలుగు భాషలో శ్రీ రాగం, ఏక తాళంలో స్వరపరచబడింది.

శివుడు కైలాసంలో తాండవం చేస్తున్నప్పుడు, ఇతర దేవతలు ఎలా ఆయనకు సహకరిస్తూ ఆనందిస్తున్నారో కవి ఇక్కడ తెలియజేస్తున్నారు.

Shivudu tandavamu cheyunamma lyrics in Telugu
Shivudu tandavamu cheyunamma - Lyrics

శివుడు తాండవము చేయునమ్మ సాహిత్యం అర్థం:

పల్లవి: ఓ భక్తులారా! వినండి, ముక్కంటి అయిన ఈశ్వరుడు కైలాసపర్వతంలో తాండవము చేస్తున్నాడు.  

అనుపల్లవి: ఈ లోకానికంతటికి తల్లైన పార్వతి దేవి ఎదురుగా, శివుడు ఆటంకం లేకుండా ఎల్లప్పుడు తాండవము చేస్తూ ఉన్నాడు.

చరణం 1: సరస్వతి దేవి వీణ వాయిస్తూ శృతి చేస్తుంటే, దానికి అనుగుణంగా లయ తప్పకుండ బ్రహ్మదేవుడు తాళము వేస్తున్నాడు.

సరస్సులు ప్రవహించే విధానమే అలంకారాలలోని ఏడు తాళాలేమో అని అనిపించే విధంగా, అందరూ సహకరిస్తుంటే, ఆనందంతో సాయంత్రం వేళ ఆ పరమ శివుడు తాండవం చేస్తున్నాడు.

చరణం 2: దేవతలకు అధిపతైన ఇంద్రుడు పిల్లనగ్రోవిని వాయిస్తుండగా, సంతోషంతో విష్ణుమూర్తి మద్దెల వాయిస్తుంటే….

భరత మునిచే రచించబడిన నాట్య శాస్త్రంలో తెలిపిన విధంగా శివుడు ధిమిత ధిమిత తద్ధిమి ద్ధిమి (శాస్త్రీయ నృత్యం యొక్క లయ) అని తాండవము చేస్తున్నాడు.

Click here for pdf శివుడు తాండవము చేయునమ్మ (Shivudu tandavamu cheyunamma lyrics in Telugu)

Click here for English

చిట్క:

సంగీతం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారో తెలుసుకోండి: మీరు మీ సమయాన్ని వెచ్చించి ఏదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు, ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ కారణం వ్యక్తిగతమైనది మరియు అర్థవంతమైనదిగా ఉండాలి.

సంగీతం నేర్చుకోడానికి మీ కారణం దృఢంగా ఉండాలి, అప్పుడే సంగీతం నేర్చుకోవడం కష్టంగా అనిపించినప్పుడు (కఠినంగా అనిపిస్తుంది) కూడా వదలకుండా పట్టుదలతో నేర్చుకుంటారు.

గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏమిటంటే, మిమ్మల్ని ప్రేరేపించడానికి మరియు మీకు వచ్చే సందేహాలు తీర్చడానికి గురువు ఉండడం చాలా అవసరం.

ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ, మీ సంగీత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మిమ్మల్ని మీరు ఎప్పుడూ ముందుకు తెచ్చుకోవాలి మరియు కష్టపడి పనిచేయాలి.

మీకు ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి దిగువ comments sectionలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో కలుద్దాం. నమస్కారం. 

భో శంభో శివ శంభో స్వయంభో                                                         తరువాత

కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు