రామచంద్రాయ జనక
(శ్రీరామదాసు కీర్తన)
Ramachandraya janaka lyrics in Telugu with meaning: రామచంద్రాయ జనక, సంస్కృత భాషలో శ్రీరాముని యొక్క విభిన్న లక్షణాలను కీర్తిస్తూ శ్రీ రామదాసుచే రచించబడిన చాలా ప్రజాదరణ పొందిన కీర్తన.
భక్త రామదాసు లేదా భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న, 17వ శతాబ్దానికి చెందిన శ్రీ రామ భక్తుడు, కవి మరియు కర్ణాటక సంగీత స్వరకర్త.
ఇతను తెలుగు శాస్త్రీయ యుగం నాటి ప్రసిద్ధ వాగ్గేయకారుడు (సాహిత్యాన్ని రాసి దానికి సంగీతాన్ని కూడా సమకూర్చేవారు).
ఖమ్మం జిల్లాకు చెందిన నేలకొండపల్లి గ్రామంలో జన్మించిన ఈయన యుక్తవయస్సులోనే అనాథగా మారారు.
ఇతను కుతుబ్ షాహీ పాలనలో కొంత కాలాన్ని భద్రాచలంలో మరియు పన్నెండేళ్ళు గోల్కొండ జైలులో ఏకాంత నిర్బంధంలో గడిపారు.
తెలుగు చరిత్రలో ఈయన జీవితం గురించి వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది ఒడ్డున ప్రసిద్ధ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించడంలో ఇతను ప్రసిద్ధి చెందాడు.
శ్రీ రామునిపై భక్తితో రచించిన ఇతని కీర్తనలు పల్లవి, అనుపల్లవి మరియు చరణం శైలిలో ఎక్కువగా తెలుగులో, కొన్ని సంస్కృతంలో మరియు అప్పుడప్పుడు తమిళ భాషలో స్వరపరచబడ్డాయి.
ఈ కీర్తనలు దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో శ్రీ రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.
కర్నాటక శాస్త్రీయ సంగీతం యొక్క త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజ స్వామి తను స్వరపరచిన సంకీర్తనలలో ఐదు కీర్తనలను శ్రీ రామదాసును స్తుతిస్తూ అంకితం చేశారు, రామదాసును హిందూమతంలోని పురాణాలలో అత్యంత ప్రియమైన వ్యక్తులైన నారద ముని మరియు భక్త ప్రహ్లాద వంటి వ్యక్తులతో సమానంగా పోల్చారు.
రామచంద్రాయ జనక – సాహిత్యం అర్థం:
పల్లవి: జనక రాజు కుమార్తెన సీతాదేవి హృదయాన్ని గెలుచుకున్న మరియు మా కోరికలన్నీ తీర్చే గొప్పవాడైన శ్రీరామచంద్రునికి హారతి ఇచ్చి పూజిస్తున్నాము.
చరణం-1: మృదువైన చిరునవ్వుతో తన భక్తులను రక్షిస్తూ, దేవేంద్రుడు మరియు ఇతరుల చేత పూజించబడే కోసల దేశ (సరయు నది ఒడ్డున ఉన్న సుసంపన్నమైన దేశం. అయోధ్య ఈ రాజ్యానికి రాజధాని) ప్రభువైన, మనోహరమైన శ్రీరామచంద్రునికి హారతి ఇచ్చి పూజిస్తున్నాము.
చరణం-2: నుదుటిపై అందమైన కుంకుమ బొట్టుతో, తన శరీరానికి పూసిన చందనంతో మరియు మెడలో పూలమాలతో ప్రకాశిస్తున్న గొప్ప శ్రీరామునికి హారతి ఇచ్చి పూజిస్తున్నాము.
చరణం-3: సొగసైన వజ్రపు వృత్తాకార పోగులతో, తులసి మాలతో అలంకరించబడి, తామరపువ్వుకు సాటైన శరీరాన్ని కలిగి ఉన్న శ్రీరామచంద్రునికి అపురూపమైన హారతి.
చరణం-4: తామరపువ్వురేకులవంటి కన్నులు గల వానికి, నిండైన చంద్రునివంటి ముఖము గల వానికి, గుడ్డు నుండి పుట్టిన గరుడ పక్షిని వాహనంగా కలిగిన వాడైన శ్రీరామచంద్రునికి అపారమైన హారతి.
చరణం-5: నిర్మలమైన, నిష్కళంకమైన, రకరకాలైన వేదములు మరియు ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే మహోన్నతమైన శక్తి కలిగిన మరియు మంచి హృదయం ఉన్న ప్రజల కోరికలను తీర్చే పరమాత్మైన శ్రీరామునికి ఆహ్లాదకరమైన హారతి.
చరణం-6: రామదాసుని తామరపువ్వు వంటి మృదువైన హృదయంలో నివసించే భగవంతుడైన భద్రాచల రామచంద్రునికి సంపూర్ణ హారతి.
Click here for pdf రామచంద్రాయ జనక (Ramachandraya janaka lyrics in Telugu)
And click here for English
చిట్క:
సంగీతం, ప్రాథమిక అంశాల (బేసిక్స్) తో ప్రారంభించండి: ఏదైనా కొత్త నైపుణ్యంలో ప్రావీణ్యం పొందాలంటే మొదటి దశ దాని ప్రాథమిక అంశాలతో ప్రారంభం కావాలి, అదే సంగీత అభ్యాసానికి కూడా వర్తిస్తుంది.
ఇది మీ సంగీత అభ్యాసానికి పునాది మరియు అభ్యాస ప్రక్రియను సులభతరం చేసి మీ సంగీత ప్రయాణాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← పలుకే బంగారమాయెనా రామ లాలీ మేఘ శ్యామ లాలీ →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏼..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.