మహా గణపతిం
Maha gaNapatim lyrics in Telugu with meaning: ఈ పాట ముత్తుస్వామి దీక్షితార్ గారిచే సంస్కృత భాషలో రచించబడి స్వరపరచబడిన చాలా ప్రజాధరణ పొందిన పాట.
ఇతని ముద్ర “గురుగుహ”. కర్నాటక శాస్త్రీయ సంగీతం యొక్క కచేరీలలో ఇతను స్వరపరిచిన కృతులను విస్తృతంగా పాడతారు.
ఇతను కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు, మిగతా ఇద్దరు త్యాగరాజ స్వామి, శ్యామశాస్త్రులు.
మహా గణపతిం – సాహిత్యం అర్థం:
పల్లవి: వశిష్ఠ, వామదేవ మొదలైన మహర్షులచేత గౌరవించబడే ఆ మహా గణపతిని మనస్ఫూర్తిగా స్మరిస్తున్నాను.
చరణం: పరమేశ్వరుని కుమారుడు, నా (ముత్తుస్వామి దీక్షితార్) చేత కీర్తించబడే ఆ వినాయకుడు కోటి సూర్యులకు సమానంగా ప్రకాశిస్తూ ప్రశాంతంగా వెలిగిపోతున్నాడు.
మహాభారతంలో జరిగిన విషయ-విశేషాలను వ్యాస మహర్షి వల్లిస్తుండగా, ఎలుకను వాహనంగా కలిగి, మోదకాలను ఇష్టపడే విఘ్నేశ్వరుడు నిరంతరాయంగా ఎంతో శ్రద్ధగా వ్రాశాడు, అలాంటి ఆ మహా గణపతిని మనస్ఫూర్తిగా స్మరిస్తున్నాను.
Click here for the pdf మహా గణపతిం (Maha gaNapatim lyrics in Telugu)
And click here for English
చిట్క:
సంగీతం ఎవరు నేర్చుకోవచ్చు??:
సంగీతం పట్ల మక్కువతో పాటు సాధన చేయడానికి సమయం ఉన్నవాళ్ళు ఎవరైనా సంగీతాన్ని నేర్చుకోగలరు మరియు దాని సారాన్ని గ్రహించగలరు.
మీకు అలాంటి లక్షణాలు ఉంటే, సమయాన్ని వృథా చేయకండి, బదులుగా ఒక మంచి గురువును కనుగొని ప్రకృతి యొక్క కనిపించని రంగులను చూడటానికి మీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించండి.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← గణేశ్ హారతి వినాయకా నిను వినా బ్రోచుటకు →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే 👇🏼సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.