జయతి జయతి భారత మాత
Jayati jayati bharata mata lyrics in Telugu with meaning: ఈ పాట శ్రీ మయూరం విశ్వనాథ శాస్త్రి గారిచే సంస్కృత భాషలో రచించబడి స్వరపరచబడిన “భారత్ భజన్” అనే పుస్తకంలోని 18 పాటలలో ఒకటి.
ఇది దక్షిణ భారతదేశంలోని శాస్త్రీయ గాయకులలో ఒక ప్రమాణంగా మారింది. ఈ పాటలో భారతదేశ గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని అద్భుతంగా వివరించారు.
జయతి జయతి భారత మాత – సాహిత్యం అర్థం:
పల్లవి: తెలివైన వారిచే పొగడబడే ఓ భారత మాత నీకు జయము.
అనుపల్లవి: అన్ని మతాలవారితోను, అడవులలో నివసించేవారితోను, నీ సాన్నిధ్యాన్ని కోరిన వారితోను, స్నేహపూర్వకంగా ఉండే నీకు జయము.
చరణం-1: జీవులన్నింటిని సమానంగా చూస్తూ, ప్రపంచంలో ఉన్న గొప్ప పండితులతో గుర్తించబడి, పరమానందాన్ని అందరిలో పెంచే నీకు జయము.
చరణం-2: లెక్కలేనన్ని మంచి గుణాలను, దయ జాలి మెండుగా కలిగి, అందరికి మంచి జరగాలనే భావాన్ని ప్రకటిస్తూ, పడిపోతున్న వారికి చేయూతనందించే నీకు జయము.
చరణం-3: పండితులతో పూజింపబడి, చెడ్డవారి సాంగత్యానికి దూరంగా ఉండి, పాపాలను చేసేవారిని ఖండించి, భారతదేశమంతటిని దగ్గరచేసే నీకు జయము.
Click here for the pdf జయతి జయతి భారత మాత-దేశభక్తి గీతం (Jayati jayati bharata mata lyrics in Telugu)
And click here for English
చిట్క:
జాతీయ గీతాలను పాడండి: మనలో ఎంత మందికి “వందేమాతరం” “జన గణ మన” కంఠస్థం వచ్చు?? స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లేదా ఇతర సందర్భాలలో జండా ఎగరవేసినప్పుడు ఎంత మంది మన జాతీయ గీతాలను గొంతెత్తి పాడుతున్నారు??
పాడేవాళ్ళలో మీరు ఉన్నట్లయితే చాలా సంతోషం, కాని ఆ పాటలు రాకపోతే మాత్రం తప్పక నేర్చుకోండి. భారతదేశ గొప్పదనాన్ని ఎలుగెత్తి చాటండి.
భిన్నమైన భాషలు, వేషధారణలు, సంస్కృతి-సంప్రదాయాలు, నృత్యాలు, పాటలు ఉన్నా మనమందరం ఒకటే అన్న ఐకమత్యాన్ని చాటండి. జై హింద్….
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← తల్లీ భారతి వందనం మా తెలుగు తల్లికి మల్లెపూదండ →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏾 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
ధన్యవాదాలు