హెచ్చు స్థాయి స్వరాలు
Hecchu Sthayi Swaralu in Telugu: “హెచ్చు స్థాయి స్వరాలు” అనేవి పైకి పాడే స్వరాలు, ఇవి నేర్చుకోవడం వలన మనం పై స్వరాలను సులభంగా పాడగలుగుతాం. ఇవి చాలా సులభంగా అర్థం అవుతాయి కూడా. మొదటిది నేర్చుకొని తరువాత దానికి వెళ్ళినపుడు అందులో ముందు దాని కొంత భాగం ఉంటుంది.
ఇందులో మనం తారాస్థాయి “మ” వరకు నేర్చుకుంటాం. హెచ్చు స్థాయి స్వరాలనే “తారాస్థాయి స్వరాలు” అని కూడా అంటారు.
గమనిక: మూడో కాలం పాడేటప్పుడు తాళం పూర్తి కాకపోతే, తాళం పూర్తి అయ్యేంత వరకు ఇంకోసారి పాడాలి కానీ మధ్యలో వదిలేయకూడదు.
Click here for pdf హెచ్చు స్థాయి స్వరాలు
Click here for English
చిట్క:
- సంగీత సాధన ప్రారంభించడానికి ముందు, అయిపోయిన తరువాత స ప స తప్పని సరిగా పాడాలి. శృతి బాక్స్ లేదా తంబురని వింటూ పాడాలి. మీ మొబైల్ లో శృతి బాక్స్ లేదా తంబుర ఆప్ ని పెట్టుకోండి.
- శృతి బాక్స్ లేదా తంబురలో స ప స్వరాలు ఉంటాయి.
- మీ సంగీత సాధన మొదలు పెట్టేముందు ఈ స్వరాలను జాగ్రత్తగా 5 నిమిషాలైనా వినాలి.
- మీరు పాడేటప్పుడు ఒక స్వరం నుండి ఇంకో స్వరానికి తొందరగా వెళ్లిపోకుండా స్వరాలను మీ గొంతులో కాసేపు ఉండనివ్వండి అప్పుడు మీరు పాడేది శృతి బాక్స్ తో కలుస్తుందో లేదో మీకు తెలుస్తుంది కలవకపోతే దానికి తగ్గట్టు సర్దుబాటు చేసుకోవచ్చు. ఇది మీ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చెయ్యండి.
గీతాల్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.