Keraya Neeranu Geetam in Telugu

కెరయ నీరను - గీతం

Keraya neeranu geetam in telugu: కెరయ నీరను శ్రీ పురందర దాసు వ్రాసిన 475,000 గీతాలలో ఒకటి. మనకు దేవుడు ఇచ్చిన దానిని మనం మరల ఆయనకే సమర్పించి ఆనందాన్ని సంతృప్తిని పొందాలనే జీవిత సత్యాన్ని శ్రీ పురందరదాసు ఈ గీతంలో మనందరికీ గుర్తుచేస్తున్నారు. ఇది కన్నడ భాషలో వ్రాయబడింది.  

ఈ గీతం త్రిశ్ర జాతి త్రిపుట తాళంలో ఉంది. ఇందులో ఒక లఘువు మరియు రెండు ఒక ధృతాలు ఉన్నాయి.

రచన: శ్రీ పురందర దాసు

రాగం: మలహరి (15వ మేళకర్త యైన మాయామాళవగౌళ జన్యం)  

తాళం: త్రిపుట తాళం (త్రిశ్ర జాతి)              క్రియలు: 07

Keraya neeranu geetam - swaram & saahityam
కెరయ నీరను గీతం స్వరం & సాహిత్యం
Keraya neeranu - Saahityam
కెరయ నీరను గీతం సాహిత్యం

కెరయ నీరను సాహిత్యం-అర్థం:

మహా పురుషులు, ఋషులు శ్రీ మహా విష్ణువుని పూజించేటప్పుడు కొలను నుంచి నీటిని తీసుకొని మరల ఆ నీటిని కొలనులో ఏ విధంగానైతే విడిచిపెడతారో అదే విధంగా మనమందరం ఆ శ్రీహరి నుండి పొందిన వరాలను, ఆశీర్వాదాలను మరల ఆయనకే సమర్పించాలి.

శ్రీ పురందర దాసు, ఆ విఠల రాయుని కమలముల వంటి పాదాలు చూడగానే ఆయన జన్మ ధన్యమయ్యిందని ఇందులో చెప్తున్నారు.

Click here for pdf కెరయ నీరను గీతం

Click here for English

చిట్క:

ఏవైనా సరే నేర్చుకొని వదిలేయకండి, నేర్చుకున్న పాటలను, గీతాలను, వర్ణాలను మీ ఇంట్లో ఏదైనా పూజ, సమావేశాలు జరిగేటప్పుడు, పెళ్లిళ్లు, పేరంటాలు, మీ విద్యాలయాలలో జరిగే పోటీల్లో పాల్గొనండి. దీని వలన మీరు మరింత ఎక్కువ నేర్చుకోగలుగుతారు.

పదుమనాభా గీతంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.

కుంద గౌర                                                                                         పదుమనాభా

కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇 సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు