పదుమనాభా - గీతం
Padumanabha geetam in telugu: “పదుమనాభా” శ్రీ పురందర దాసు 16వ శతాబ్ధంలో వ్రాసిన 475,000 గీతాలలో ఒకటి. ఈ గీతంలో పురందర దాసు, శ్రీ మహావిష్ణువును వివిధ పేర్లతో వర్ణించారు. ఇది సంస్కృత భాషలో వ్రాయబడింది.
ఈ గీతం త్రిశ్ర జాతి త్రిపుట తాళంలో ఉంది. ఇందులో ఒక లఘువు మరియు రెండు ధృతాలు ఉన్నాయి.
రచన: శ్రీ పురందర దాసు
రాగం: మలహరి (15వ మేళకర్త యైన మాయామాళవగౌళ జన్యం)
తాళం: త్రిపుట తాళం (త్రిశ్ర జాతి) క్రియలు: 07
పదుమనాభా సాహిత్యం-అర్థం:
పల్లవి: నాభి నందు పద్మము కలిగి వైకుంఠంలో నివాసముండే ఓ పురుషోత్తమ, నీవు పరమాత్మ రూపానివి,
ప్రతికూల పరిస్థితులను నాశనం చేసేవాడవు, గరుడపక్షి మీద ఎక్కి విహరించే నీ చరిత్ర నిర్మలమైనది.
అనుపల్లవి: పాల సముద్రం మీద నివసించి, ఆదిశేషుడినే నీ పడకగా చేసుకున్న అత్యున్నత గొప్పదనము గలవాడివి,
ఓ యాదవ కుల తిలకా, రామావతారంలో నీ తండ్రియైన దశరధ మహారాజు యొక్క ఆజ్ఙానుసారం విశ్వామిత్ర మహర్షితో ఆయన ఆశ్రమానికి వెళ్లి అక్కడ జరిగే యజ్ఞ్యాన్ని రక్షించావు.
చరణం: రావణాసురుని సోదరుడైన విభీషణుడిన్ని పాలించిన శ్రీ రామచంద్ర నీకు నా వందనాలు,
ఏనుగు, మొసలి బారిన పడి నిన్ను ప్రార్థించినప్పుడు ప్రత్యక్షమై ఆ ఏనుగును కాపాడిన నీకు నమస్కారాలు,
నీవు ఎల్లప్పుడూ శుభాలను కలుగజేసి, శత్రువుల నుండి మమ్మల్ని రక్షించడానికి ఒక స్తంభంలా బలంగా నిలబడతావు,
దేవతలకు అధిపతైన ఇంద్రుని మనసును రంజింపచేసినవాడివి, రామావతారంలో జాంబవంతునికి ఇచ్చిన వరాన్ని కృష్ణావతారంలో తీర్చిన స్వామి! ఇప్పుడిప్పుడే నీ పాదాలను చేరుకుంటున్న నన్ను (పురందరదాసుని) ఎల్లప్పుడు కాపాడు.
Click here for pdf పదుమనాభా గీతం (Padumanabha geetam in telugu)
Click here for English
చిట్క:
మీరు ఏవైనా సాధన చేస్తున్నప్పుడు తప్పుగా అనిపించినట్లైతే దాన్ని పదే పదే సాధన చేయకండి; బదులుగా కొంత సమయం ఆలోచించి సరైన దానిని సాధన చెయ్యండి. మీకు ఇంకా గుర్తురాకపోతే మీ గురువుని అడిగి తెలుసుకోండి.
వరవీణ గీతం లో మళ్లీ కలుద్దాం. ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. నమస్కారం.
← కెరయ నీరను వరవీణ →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏻 సంప్రదించండి.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.