Adivo alladivo lyrics in Telugu with meaning

అదివో అల్లదివో
(అన్నమాచార్య కీర్తన)

Adivo alladivo lyrics in Telugu with meaning: ఈ కీర్తన తిరుమల వేంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన బహు ప్రాచుర్యం పొందిన కీర్తన.

ఈ పాటలో అన్నమాచార్యులవారు శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ, ఆ దేవాది దేవుడిని దర్శించుకొని ఆనందాన్ని పొందమని భక్తులకు పిలుపునిస్తున్నారు.

Adivo alladivo lyrics in Telugu with meaning
అదివో అల్లదివో
Adivo alladivo lyrics meaning in Telugu
అదివో అల్లదివో - సాహిత్యం అర్థం

అదివో అల్లదివో – సాహిత్యం అర్థం:

పల్లవి: ఆదిశేషుని పదివేల పడగలతో కప్పినట్టు కనిపిస్తున్న ఆ ప్రదేశం అదిగో అక్కడ ఉంది, అదే శ్రీ మహావిష్ణువు యొక్క నివాస స్థలము.

చరణం-1: అదే వేంకటాచలం, ఇది విశ్వములో ఉన్న అన్నిటికంటే ఉన్నతమైనది. అది “బ్రహ్మ” (సృష్టికి అధిపతి అయిన భగవంతుని స్వరూపం) మరియు ఇతరులకు అత్యంత ప్రాణప్రదమైనది. అదే సమస్త మునులకు శాశ్వత నివాస స్థలం. అంత గొప్పదైన ఆ వేంకటాచలాన్ని దర్శించి, దానికి నమస్కరించి పరమానందాన్ని పొందండి.

చరణం-2: అదిగో మనకు చేరువలో ఉన్న “శేషాచలం” (వేంకటేశ్వరుడు నివసించే తిరుమలలోని ఏడు కొండలలో ఒకటి), అది ఆకాశంలో సంచరించే దేవతల నిజమైన నివాస స్థలం. ఎక్కడో దూరంలో ఉన్నాడనుకున్న మన సంపదైన వేంకటేశ్వర స్వామి అదిగో బంగారం వంటి కొండ శిఖరాల మీద పరమాత్మ స్వరూపంగా కొలువై మనకు చేరువలోనే ఉన్నాడు.

చరణం-3: శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క శోభాయమాయమైన, ముక్తిని ప్రసాదించే స్థానమైన వేంకటాద్రి అదిగో, సర్వ సంపదలకు రూపమైన, పవిత్రమైన వాటికంటే పవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి అదిగో ఆ కొండపైనే ఉన్నాడు, ఆ స్వామిని మనసులో తలచుకొని, కన్నుల నిండుగా దర్శించుకొని పుణ్యాత్ములు అవ్వండి.

Click here for pdf అదివో అల్లదివో (Adivo alladivo lyrics in Telugu)

And click here for English

చిట్క:

గానం యొక్క ప్రాథమికాలను (Basics) అర్థం చేసుకోండి

శ్వాస నియంత్రణ: మెరుగైన శ్వాస మద్దతు కోసం శ్వాస సంబంధిత వ్యాయామాలను చేయండి.

భంగిమ: భుజాలను నిటారుగా ఉంచి కూర్చోవాలి లేదా నిల్చోవాలి, అలా ఉండడం వలన శ్వాస నియంత్రణ సరిగ్గా ఉండి, పాడడానికి అనువుగా ఉంటుంది.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

చూడరమ్మ సతులాల                                                                                                                          Next

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం, కూచిపూడి మరియు పాశ్చాత్య (Western) నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *