Analekara geetam

ఆనలేకర - గీతం

శ్రీ పురందర దాసు రచించిన ఆనలేకర గీతం (Analekara Geetam) 16వ శతాబ్ధంలో వ్రాసిన 475,000 గీతాలలో ఒకటి. పురందర దాసు 1500లలో సంగీతాన్ని కంపోజ్ చేయడం ప్రారంభించినప్పుడు రాసిన గీతాలలో ఆనలేకర ఒకటి. భక్తి, మత గ్రంధాల జ్ఞానం లేకుండా జీవితాన్ని వృధా చేసుకోవద్దని కవి ఈ గీతంలో హెచ్చరిస్తున్నారు. ఇది కన్నడలో వ్రాయబడిన సాధారణ పాట.

ఈ గీతం త్రిశ్ర జాతి త్రిపుట తాళంలో ఉంది. ఇందులో ఒక లఘువు మరియు రెండు ఒక ధృతాలు ఉన్నాయి.

రచన: శ్రీ పురందర దాసు

రాగం: శుద్ధ సావేరి (29వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం).

తాళం: త్రిపుట తాళం (త్రిశ్ర జాతి)              క్రియలు: 07

Analekara Suddha Saveri ArohaNa & AvarohaNa
శుద్ధ సావేరి రాగం ఆరోహణ & అవరోహణ
Aanalekara Swaram & Sahityam
ఆనలేకర గీతం సాహిత్యం
Analekara Geetam Saahityam
ఆనలేకర గీతం సాహిత్యం
సాహిత్యం-అర్థం:

[మనం చూస్తుండగానే ట్యాంక్‌లో నిల్వ ఉంచిన నీరు మరో మార్గం ద్వారా ఎలాగైతే బయటికి వెళుతుందో అదే విధంగా, బాధాకరంగా అన్ని పురాతన గ్రంథాలు మరియు పురాణాల గురించి అవగాహన లేకుండా నా జీవితం వృధా చేయబడింది అందువలన మేము ఈ మార్గం ద్వారా వంతెనను దాటి జటాజూటాధారి అయిన ఆ శివున్ని చేరుకొని ఆయన ముందు దీనంగా మోకరిల్లి మమ్మల్ని కాపాడమని వేడుకుంటాము].

Click here for pdf ఆనలేకర గీతం

Click here for English

చిట్క:

మీ రోజువారీ పనుల ఒత్తిడి నుండి బయటపడటానికి సంగీతం చక్కగా ఉపయోగపడుతుంది. ఉయ్యాల ఊగితే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీరు పాడే విధానం కూడా అంతే హాయిగా ఉండాలి. మీరు నేర్చుకునే పాటను ఆస్వాదించండి దాని సాహిత్యంలోని లోతును ఆకళింపు చేసుకోండి. పాటను క్షుణ్ణంగా గ్రహించడానికి ఇదే ఉత్తమ మార్గం.

రార వేణు స్వరజతిలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.

మందర ధారే గీతం                                                  రార వేణు స్వరజతి

కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏻  సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు