Bantureethi koluvu lyrics in Telugu with meaning

బంటు రీతి కొలువు - త్యాగరాజు కృతి

Bantureethi koluvu lyrics in Telugu with meaning: బంటు రీతి కొలువు శ్రీ త్యాగరాజు స్వరపరిచిన కృతులలో ఒకటి.

పంచరత్న కృతులకు అత్యంత ప్రసిద్ధి చెందిన త్యాగరాజ స్వామి, కర్ణాటక సంగీత గొప్ప స్వరకర్తలలో ఒకరు. బంటు రీతి కొలువు కృతి హంసనాదం రాగం, ఆది తాళంలో స్వరపరచబడింది.

Bantureethi koluvu lyrics in Telugu
బంటు రీతి కొలువు
Bantureethi koluvu lyrics in Telugu with meaning

బంటు రీతి కొలువు – సాహిత్యం అర్థం:

పల్లవి: ఓ రామచంద్రా! నీకు సేవకుడిగా ఉండేటువంటి గొప్ప ఉద్యోగాన్ని నాకు ప్రసాదించు తండ్రి.

అనుపల్లవి: దుష్టులను, వారి మాట వినే వారినందరి అరిషడ్వార్గాలన్నింటిని (కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు) పడగొట్టి నశింపచేసేటువంటి సేవకుడిగా నీ సన్నిధిలో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ప్రశాదించు స్వామి.

చరణం: శరీరాన్ని కాపాడే మేలైన, గట్టిదైన కవచాన్ని, నేను నీ భక్తుడననే చిహ్నాన్ని, రామ నామము అనే విలువైన కత్తిని ఇచ్చి, నీ సేవకుడిగా విరాజిల్లే శాశ్వతమైన వరాన్ని నాకు ప్రసాదించు తండ్రి.

Click here for pdf బంటు రీతి కొలువు (Bantureethi koluvu lyrics in Telugu)

Click here for English

చిట్క:

పాటను చిన్న చిన్న భాగాలుగా విడదీయండి: మొత్తం పాటను ఒకేసారి నేర్చుకోవలసిన అవసరం లేదు, ఎందుకంటే కొన్నిసార్లు దాని మొత్తాన్ని ఒకేసారి గ్రహించడం కష్టమనిపిస్తుంది. అలా చేయడం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు.

బదులుగా, పాటను చిన్న చిన్న విభాగాలుగా విభజించి సాధన చెయ్యడం మొదలు పెట్టండి, అప్పుడు మొత్తం పాటను చాలా సులభంగా నేర్చేసుకుంటారు.

చాలా సందర్భాలలో, పాటకు ఒక పల్లవి మరియు రెండు మూడు చరణాలు ఉంటే, అన్ని చరణాల పాడే విధానం ఒకేలా ఉంటుంది, సాహిత్యం మాత్రమే భిన్నంగా ఉంటుంది.

అలాంటి సందర్భాలలో, మీరు మొదటి చరణం మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి, మిగిలిన వాటికి సాహిత్యం మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….

పలుకే బంగారమాయెనా                                               సీతా కళ్యాణ వైభోగమే

కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు