భో శంభో శివ శంభో స్వయంభో
(శివుని పాట)
Bho shambho shiva shambho lyrics in Telugu with meaning: భో శంభో శివ శంభో స్వయంభో పాట శ్రీ దయానంద సరస్వతి గారిచే సంస్కృత భాషలో రేవతి రాగం, ఏక తాళంలో స్వరపరచబడింది.
ఈ సంసార సాగరం నుండి మమ్మల్ని కడతేర్చి, కరుణించి కాపాడమని కవి ఆ పరమశివున్ని ప్రార్థిస్తున్నాడు.
భో శంభో శివ శంభో స్వయంభో సాహిత్యం అర్థం:
పల్లవి: ఓ పరమేశ్వర, నీకు నీవుగా (తల్లితండ్రులు లేకుండా) వెలసిన శుభప్రదమైన పరమశివుడవు నీవు.
అనుపల్లవి: గంగను తలపై ధరించిన దయగల ఓ శంకర, నీవే మమ్మల్ని ఈ సంసారమనే సముద్రం నుంచి రక్షించే వాడివి.
చరణం 1: బంధాలు లేని భగవంతుని స్వరూపానివి. ఈ సంసారంలో జరుగుతున్నవి, జరగబోయేవి, మరియు జరిగిపోయిన వాటన్నింటినుంచి విడిపించేవాడివి (బంధాలన్నిటినుంచి ముక్తిని ప్రసాదించేవాడివి).
శాశ్వతమైన హిమాలయ కొండ గుహలో అసాధారణంగా, అపరిమితంగా, అధికమైన సంతోషముతో నివశించే నాశనంలేని లింగ స్వరూపానివి.
చరణం 2: ధిమిత ధిమిత ధిమి ధిమికిట కిటతోం, తోం తోం తిరికిట తరికిట కిటతోం (శాస్త్రీయ నృత్యం యొక్క లయ).
మునులలో ముఖ్యుడైన మతంగ మునిచే స్తుతించబడిన ఓ ఈశ్వర!
ఆకాశానంతటిని వస్త్రంగా చుట్టూ ధరించి, ఎల్లప్పుడూ దోషం లేకుండా అవిరామంగా నాట్యం చేసే నాట్యేశ్వరుడవైన నీవు సభలకు అధిపతివి మరియు సర్వ లోకాలకు చక్రవర్తివి.
Click here for pdf భో శంభో శివ శంభో స్వయంభో (Bho shambho shiva shambho lyrics in Telugu)
Click here for English
చిట్క:
పునరావృతం తప్పనిసరి: మనం ఏది నేర్చుకోవాలన్నా సాధన చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. ఎంత ఎక్కువ సాధన చేస్తే, అంత నైపుణ్యాన్ని సాధించగలుగుతాం. పాటలోని కష్టమైన భాగాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది.
పాటలోని నిర్దిష్ట విభాగాన్ని సాధన చేయండి, మీకు నమ్మకం కలిగే వరకు మళ్లీ మళ్లీ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వలన మీరు సత్ఫలితాలు పొందగలుగుతారు.
మీకు ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి దిగువ comments sectionలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో కలుద్దాం. నమస్కారం.
← జై గణేశా జయ గణేశా శివుడు తాండవము చేయునమ్మ →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.