గోవిందాచ్యుత - గీతం
Govindachyuta geetham lyrics in Telugu with meaning: ఈ గీతం చాలా సరళమైన విధంగా రచించబడిన గీతాలలో ఒకటి. ఇక్కడ కవి విష్ణుమూర్తిని రకరకాల పేర్లతో స్తుతించారు. ఇది సంస్కృత భాషలో వ్రాయబడింది.
ఈ గీతం మఠ్య తాళంలో ఉంది. ఇందులో ఒక లఘువు, ఒక ధృతం మరియు ఒక లఘువు ఉన్నాయి.
రాగం: శంకరాభరణం (29వ మేళకర్త “ధీర శంకరాభరణం” రాగం), ఇది “సంపూర్ణ రాగం” అంటే ఈ రాగంలో ఏడు స్వరాలూ ఉంటాయి.ఈ
గోవిందాచ్యుత గీతం సాహిత్యం-అర్థం:
ఓ దేవ! నీవు ఆవులను ఆహ్లాదపరిచే వాడవు, నీ స్వభావాన్ని మరియు శక్తులను ఎప్పటికీ కోల్పోని వాడవు, ఆధ్యాత్మిక పురోగతికి అన్ని అడ్డంకులను తొలగించేవాడివి, మధు అనే రాక్షస విధ్వంసకుడువి, ఆకులు మరియు అడవి పుష్పాలతో చేసిన మాలను ధరించేది నీవే.
గరుత్మంతుడిని చిహ్నంగా కలిగిన వాడివి, ముక్తి దాతవు, లక్ష్మిదేవిని హృదయమునందు కలిగినవాడివి, రఘు వంశానికి ప్రభువువి, ఆదిశేషుని మీద పవళించేవాడివి, అందమైన, ఆకర్షణీయమైన నీకు జయము జయము. సీతాదేవికి ఇష్టమైన ఓ శ్రీ రామా, పట్టాభిరామా నన్ను రక్షించు.
Click here for pdf గోవిందాచ్యుత (Govindachyuta geetham lyrics in Telugu)
And click for English
చిట్క:
నిజమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి, మీ నైపుణ్యాల స్థాయికి మరియు మీరు సాధనకు కేటాయించాల్సిన సమయాన్ని బట్టి మీ లక్ష్యం వాస్తవికంగా ఉండాలి.
ఆరునెలల్లోనో, ఏడాదిలోనో శ్రీమతి ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారు పాడిన విధంగా పాడాలన్నది మీ లక్ష్యం అయితే, కచ్చితంగా సాధించలేం. ఎందుకంటే ఆవిడ కూడా కొన్ని సంవత్సరాల కృషి, సాధన ఫలితంగానే అంత చక్కగా పాడగలిగారు.
ఈ గీతం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. కమల సులోచన గీతంలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….
← కమలజదళ కమల సులోచన →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏼 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.