harathi meerela ivvare lyrics in Telugu with meaning

హారతి మీరేల ఇవ్వరే
(అమ్మవారి హారతి పాట)

Harathi meerela ivvare lyrics in Telugu with meaning: ఈ అమ్మవారి హారతి పాట బహు ప్రాచుర్యం పొందినది. ఇక్కడ కవి రాక్షసులను చంపే ఓంకార రూపమైన పరమేశ్వరి పాదాలకు పూజ చేసి ఆవిడ దీవెనలను అందుకోమని చెప్తున్నారు.

Harathi meerela ivvare lyrics in Telugu with meaning
హారతి మీరేల ఇవ్వరే - సాహిత్యం

హారతి మీరేల ఇవ్వరే – సాహిత్యం అర్థం:

పల్లవి: మనందరికీ తల్లైన ఆ పార్వతీ దేవికి హారతి ఇవ్వండి. 

అనుపల్లవి: మనకు జ్ఞానాన్ని ఇచ్చే విద్యలన్నింటికంటే గొప్పదైన, మంచి బంగారంతో చేసినట్టు నిండుగా ఉన్న పరమేశ్వరికి హారతి ఇవ్వండి.

చరణం-1: పాదములకు పూజ చెయ్యండి మరియు పారిజాత పూలతో చేసిన మాలను ఆ తల్లికి సమర్పించండి.

మంచి ముత్యాలతో చేసిన దండను, చిరు గంటలతో చేసిన వడ్డాణం, పట్టీలు, వజ్రాలతో చేసిన పాపిట బిళ్ళ, బొట్టు, ముక్కుపుడక మొదలైనవన్నీ సమయానికి తగ్గట్టు ధరించే తల్లికి హారతి ఇవ్వండి.

చరణం-2: ఎంత పిలిచినా పట్టించుకోని రుద్రుని దేవికి, ఓంకార రూపమైన శంకరికి, కుంకుమను నుదుటను అలంకరించుకున్న, శుభాలను కలిగించే సౌందర్యవతికి దగ్గరే ఉండి పూజ చేయండి.

చరణం-3: లక్షవొత్తులతో దీపాలను పేర్చండి, ఓ చెలులార మీరు పళ్లాలలో తీసుకువచ్చిన పసుపు కుంకుమలతో అభిషేకం చేయండి.

రాక్షసులను చంపి మనలను రక్షించే దయగల దేవిని కీర్తిస్తూ సంతోషంతో హారతి ఇవ్వండి.

Click here for pdf హారతి మీరేల ఇవ్వరే (harathi meerela ivvare lyrics in Telugu)

And click here for English

చిట్క:

స్థిరమైన సాధన చేయండి:

సంగీతాన్ని నేర్చుకోవడానికి క్రమమైన అభ్యాసం అవసరం. ఒక పాట రెండు మూడుసార్లు విని, మనకు అర్థమైనది పాడి, నాకు వచ్చింది అని అనుకుంటే మనలను మనం మోసం చేసుకున్నట్లే. ఇలాంటి సాధన వలన ప్రయోజనం లేదు.

నేర్చుకోవాలనుకున్న పాటను మొదట రాసుకోండి, పదే పదే వినండి, ఎక్కడైతే కష్టంగా ఉంటుందో అది మరిన్ని ఎక్కువసార్లు వినండి, అలా విన్నదాన్ని సాధన చెయ్యండి, దానిని పాడి రికార్డు చేసి వినండి, తప్పులను సరిచేసుకొని అవి మరల రానంత వరకు పాడాక, మీకు తెలిసినవాళ్ల దగ్గర పాడి, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకొని చివరికి పాడడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

ఇదంతా వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఒక్కసారి ఆచరణలో పెడితే మీరు అంతకంటే ఎక్కువగానే అందులో శ్రద్ధ చూపిస్తారు.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

అంబే అంబికే జగదంబికే                                                                                                                   Next

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు