హిమగిరి తనయే హేమలతే
(ముత్తయ్య భాగవతార్ కృతి)
Himagiri tanaye hemalate lyrics in Telugu with meaning: హిమగిరి తనయే హేమలతే శ్రీ హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్ స్వరపరిచిన కృతులలో ఒకటి.
ఈయన 20 రాగాలను కూడా సృష్టించారు మరియు 400లకు పైగా కీర్తనలకు రాగాలను సమకూర్చారు. వీటిలో అనేక “వర్ణాలు”, “కృతులు” మరియు “తిల్లానాలు” ఉన్నాయి. ఇతడు తెలుగు, తమిళ, సంస్కృత, కన్నడ భాషలలో సంగీతాన్ని సమకూర్చారు.
1934లో ఈయన తమిళనాడు టాకీస్ నిర్మించిన “లవకుశ” సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఇతడు 63 పాటలను సమకూర్చారు. దానితో ఈ సినిమా పేరును “సంగీత లవకుశ”గా మార్చారు.
ఈయన గోటువాద్యంలోను, మృదంగంలోను అపారమైన నైపుణ్యాన్ని కలిగివున్నారు. తిరువనంతపురం దేవాలయంలో పూజాసమయంలో నాదస్వరాన్ని వినిపించే సాంప్రదాయాన్ని ఇతడే ప్రవేశపెట్టారని వినికిడి.
ఈ హిమగిరి తనయే హేమలతే పాటలో కవి పార్వతీ దేవిని వివిధ రకాలుగా పొగుడుతూ ఆ తల్లి కీర్తి ప్రతిష్టలను నలుదిశలా చాటుతున్నారు.
హిమగిరి తనయే హేమలతే – సాహిత్యం అర్థం:
పల్లవి: హిమవంతుని పుత్రికవైన తల్లీ! బంగారపు తీగెవంటి ఆకృతికలదానా! ఓ జననీ, ఈశ్వరుని పత్ని, శ్రీ లలితా, మమ్ము రక్షించు.
అనుపల్లవి: ఓ పమేశ్వరుని పట్టపురాణి, శ్రీ రాముని సహోదరి! శ్రీ మహాలక్ష్మిని, సరస్వతీ దేవిని పూజించడానికి ముందే మేము నీ పాదాల యందు శరణు వేడుకుంటున్నాము.
చరణం: బంధాలను విడగొట్టే పాశాన్ని, అంకుశము (ఏనుగును నడుపుటకు కుంభస్థలమున పొడుచు ఆయుధము), చెఱకు గడ, దండమును ధరించే ఓ తల్లీ, నీవు శ్రేష్ఠులలోనే శ్రేష్ఠమైనదానివి, నీ శాశ్వతమైన భక్తులకు ఎల్లపుడూ చేరువలో ఉంటావు. ఆకాశమంత ఆశతో ఎదురుచూసే నన్ను, ఆనందాన్నే రూపంగా కలిగి విస్తారమైన తేజస్సు కలిగిన నీవు సంతోషంగా దగ్గరికి తీసుకున్నావు తల్లీ నీకు ధన్యవాదాలు.
Click here for pdf హిమగిరి తనయే హేమలతే – సాహిత్యం (Himagiri tanaye hemalate lyrics in Telugu)
Click here for English
చిట్క:
ఒక సమయంలో ఒకే పాటను నేర్చుకోండి: మీరు ఏమి చేయాలనే దాని గురించి తక్కువ ఆలోచించడం మరియు పాటను నేర్చుకోవడం ఆచరణలో పెట్టడం ముఖ్యమైన ప్రక్రియ.
మొదటి పాటతో ప్రారంభించి, మరొక పాటకు వెళ్లకుండా, నేర్చుకోవడం పూర్తయేంత వరకు అదే పాటను పాడండి. ఇలా చేయడం వలన మీరు నేర్చుకునేది సరిగ్గా నేర్చుకోగలుగుతారు మరియు ఆ పాట పూర్తిగా వచ్చాక పొందే ఆ ఆనందమే వేరు.
ఇలా చేస్తే మీకు నేర్చుకొనే పద్ధతి, క్రమశిక్షణ అలవడతాయి. ఈ క్రమశిక్షణ ముందుముందు ఎక్కువ పాటలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← ఓంకార రూపిణి అయి గిరినందిని →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.