Indusekhara indusekhara indusekhara kawara lyrics in Telugu with meaning

ఇందుశేఖర ఇందుశేఖర ఇందుశేఖర కావరా

Indusekhara indusekhara indusekhara kawara lyrics in Telugu with meaning: ఇది ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం వారి ద్వారా ప్రసారం చేయబడిన ప్రసిద్ధ తెలుగు పాట.

నిరాడంబరమైన మరియు వినయం కలగలిపిన శివుని నుంచి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది.

శివుడు తన ప్రక్కన లోక మాత భవాని, సన్నిహిత మిత్రుడు కుబేరుడు ఉన్నప్పటికీ తాను బిక్షమెత్తుకుంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతున్నాడు.

ఇలా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపే దయామయుడైన శివుడిని, ఏమిటి ఇది, ఎందుకయ్యా ఇదంతా అని భక్తులు ఈ పాటలో ఆప్యాయంగా అడుగుతున్నారు.

“నోటిలో బంగారు చెంచా పెట్టుకుని పుట్టిన బిడ్డ తన ఐశ్వర్యాన్ని ఎప్పటికీ ప్రదర్శించడు” అని చెప్పే సామెతలా ఉంటుంది శివుని జీవితం, కాదంటారా??

Indusekhara indusekhara indusekhara kawara lyrics in Telugu
ఇందుశేఖర ఇందుశేఖర ఇందుశేఖర కావరా

ఇందుశేఖరసాహిత్యం అర్థం:

పల్లవి: చంద్రవంకను, కిరీటంలా కనిపించే జటాజూటంలో ధరించిన ఓ మహాశివ! మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు.

చరణం-1: వెండిలాగా మెరిసే మంచుకొండైన కైలాసం నివాస స్థలంగా ఉండగా శ్మశానవాటిక నీకు నివాసమా?? యక్ష (కుబేరుని భార్య) కు ప్రియమైనవాడైన కుబేరుడు (సిరి సంపదలకు అధిపతి) ఉండగా బిక్ష మెత్తటం భావ్యమా??

రక్షించమని అనగానే కాపాడే దేవుడివి ఇంకొకరిని దేహి అని అడగడం న్యాయమా?? చంద్రవంకను, కిరీటంలా కనిపించే జటాజూటంలో ధరించిన ఓ మహాశివ! ఏమిటి ఇదంతా?? ఓ దయామయా! ఎందుకు ఇదంతా??

చరణం-2: లోకానికంతటికి తల్లైన పార్వతి దేవి నీకు సగభాగంగా ఉండి సంతోషపెట్టగా, నిత్యం ధ్యానం చేస్తూ అన్ని ఇష్టాలను విడిచిపెట్టి ఎందుకు స్వామి ఈ వైరాగ్యం??

ఓ పరమేశ్వరా! బ్రహ్మ, విష్ణువులే నీ రహస్యాన్ని తెలుసుకోలేరు. చంద్రవంకను, కిరీటంలా కనిపించే జటాజూటంలో ధరించిన ఓ మహాశివ! ఏమిటి ఇదంతా?? ఓ దయామయా! ఎందుకు ఇదంతా??

చరణం-3: బంగారు ఆభరణాలు కాదని ఎందుకు పాముని హారముగా ధరిస్తున్నావు?? శుద్ధమైన భోజనాన్ని భుజించక హాలాహలం లాంటి విషాన్నీ ఇష్టంగా ఆరగించావు,

ఓ దయామయా! నీ భక్తులు నీకు సమర్పించే మంచి సువాసన కలిగిన పూలు, గంధములను కాదని శరీరమంతా బూడిద పూసుకోవడం ఎందుకయ్యా?? చంద్రవంకను, కిరీటంలా కనిపించే జటాజూటంలో ధరించిన ఓ మహాశివ! ఏమిటి ఇదంతా?? ఓ దయామయా! ఎందుకు ఇదంతా??

Click here for pdf ఇందుశేఖర ఇందుశేఖర ఇందుశేఖర కావరా (indusekhara indusekhara indusekhara kawara lyrics in Telugu)

And click here for English

చిట్క:

ఓపికగా ఉండండి మరియు సంగీత సాధన ప్రక్రియను ఆస్వాదించండి: సంగీతం తొందరగా నేర్చేసుకోవాలి, తొందరగా మంచిగా పాడేయాలి అని తొందర పడడం సరికాదు.

నిదానంగా ప్రతీ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుకు అడుగు వేయండి.

ఫలితాన్ని ఆస్వాదించండి. చిన్న చిన్న బహుమతులు మీకు మీరే ఇచ్చుకోండి, ఆలా చేయడం వలన మరింత ముందుకు అడుగువేయడానికి ఉత్సాహం వస్తుంది.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

శివుడు తాండవము చేయునమ్మ                                                                                                      Next

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం, కూచిపూడి మరియు పాశ్చాత్య (Western) నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు