Jai GaNesha Jaya GaNesha song in Telugu

జై గణేశా జయ గణేశా

పల్లవి:        జై గణేశా జయ గణేశా          

                    జయ జయ గణ నాయకా 

                    సర్వ విఘ్న నాయకా        

                    సత్ కవితా దాయకా        ‖జై గణేశా‖

చరణం 1:  నిష్కళంక నిర్వికల్ప         

                     నిత్య సత్య దాయకా           

                     ఏకదంత వక్రతుండ         

                     గణపతీ లంబోదర          ‖జై గణేశా‖

చరణం 2:  దాసదేను అభీష్టదాత      

                     వాసవార్చిత శ్రీపద

                     శ్రీకర లక్ష్మి సమేత           

                     సిద్ధి రాజా గణపతి           ‖జై గణేశా‖

అర్థం:

పల్లవి: గణాలకు, అన్ని విఘ్నాలకు నాయకా, మంచి ఙ్ఞానాన్ని ప్రసాదించే ఓ గణేశా! నీకు జయము జయము.

చరణం 1: మనస్సును స్థిరముగా ఉంచి మాకు ఎలాంటి అపవాదులు రాకుండా మమ్మల్ని మంచి మార్గంలో నడిపేవాడా, ఏకదంతము, వంకరగా ఉన్న తొండము, పెద్ద బొజ్జను కలిగిన ఓ బొజ్జగణపతీ! నీకు జయము జయము.

చరణం 2: ఓ సిద్ధి (విఘ్నేశ్వరుని భార్య) రాజా గణపతి! నిన్ను సేవించే నీ భక్తులకు కోరిన కోర్కెలను తీర్చేవాడా, శ్రీ మహావిష్టువు చేత పుష్పాలతో పూజింపబడేవాడా, ఓ మహాపురుషా! లక్ష్మి దేవితో కలిసి వచ్చి మాకు నీ దర్శన భాగ్యం కలిగించు.

Click here for pdf జై గణేశా జయ గణేశా

Click here for English

చిట్క:

మంచిగా ద్యాస పెట్టి వినేవాళ్ళు మంచిగా పాడగలుగుతారు, అందుకే ఏదైనా నేర్చుకోవాలి అనుకొనేటప్పుడు దానిని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా వినండి. వినేటప్పుడే సగం పాట వచ్చేస్తుంది, మిగతా సగం నేర్చుకోవడం కూడా సులభం అవుతుంది.

వందనం వందనం పాటలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.

శ్లోకాలు                                                                                   వందనం వందనం 

కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇 సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను డాన్స్ కూడా నేర్పిస్తాను కానీ, వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద మాత్రమే. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు