Kamalajadala Geetam

కమలజదళ - గీతం

KamalajadaLa geetam in Telugu with the meaning: “కమలజదళ గీతం” శ్రీ పురందర దాసు 16వ శతాబ్ధంలో వ్రాసిన 475,000 గీతాలలో ఒకటి. ఈ గీతంలో కవి శ్రీ మహావిష్ణువును గురించి వర్ణించారు. ఇది సంస్కృత భాషలో వ్రాయబడింది. 

సంగీతం ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవడానికి శ్రీ పురందరదాసు ఒక ప్రాథమిక పద్ధతిని 500 సంవత్సరాలకు పూర్వమే సమకూర్చారు, దానినే మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాం. ఆయన సంగీతంలో చేసిన సేవలకు గాను ఆయనని “కర్ణాటక సంగీత పితామహా” గా కొనియాడుతున్నాము.    

ఈ గీతం త్రిశ్ర జాతి త్రిపుట తాళంలో ఉంది. ఇందులో ఒక లఘువు మరియు రెండు ధృతాలు ఉన్నాయి.

రాగం: కళ్యాణి (65వ మేళకర్త రాగం), దీనిని “మేచకళ్యాణి” అని కూడా అంటారు. ఇది “సంపూర్ణ రాగం” అంటే ఈ రాగంలో ఏడు స్వరాలూ ఉంటాయి.

Kalyani ragam
కళ్యాణి రాగం ఆరోహణ & అవరోహణ
Kamalajadala geetam in telugu
కమలజదళ - గీతం
KamalajadaLa geetam in Telugu with the meaning
కమలజదళ సాహిత్యం అర్థం

కమలజదళ సాహిత్యం-అర్థం:

ఓ దయగల దేవా, తామర పువ్వు రేకుల వంటి నిర్మలమైన, అందమైన కళ్ళు కలిగిన నీవు కరుణా సముద్రుడివి, ఏనుగుల రాజైన గజేంద్రుడికి వరాన్ని ప్రసాదించి తనపై దయను చూపించావు. లక్ష్మీదేవికి ప్రియ సఖుడవు.

నీవు రాక్షసులైన కేశి మరియు నరకాసురులను వధించావు. బేళపుర నగరంలో నివసిస్తున్న నీవు దేవతలలో ఉత్తముడివి మరియు భక్తుల కోరికలను తీర్చేవాడివి. 

Click here for pdf కమలజదళ – గీతం (KamalajadaLa geetam in Telugu)

Click here for English

చిట్క:

మీరు సంగీతం నేర్చుకోవాలంటే ముఖ్యంగా మీకు ఉండాల్సింది సహనం. ఓపికతో ఒకదాని తరువాత ఒకటి నేర్చుకోవాలిగాని అన్నీ ఒకేసారి నేర్చేసుకోవాలని అనుకోవద్దు.

అలా తొందర పడి నేర్చుకోవడం వలన మీరు నేర్చుకున్న దాని మీద సరైన అవగాహన ఉండదు, మరియు తప్పుగా నేర్చుకొనే అవకాశం ఉంది. ఒకసారి తప్పుగా నేర్చుకున్నాక దానిని సరిచేసుకోవడం చాలా కష్టమైన పని.

నెమ్మదిగా సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టి నేర్చుకున్న దానిని సాధన చేసి దాని తరువాత దానికి వెళ్ళండి. మీకు సంగీతం మీద అనుభవం లేదు కనుక నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ముఖ్యంగా మీ సహనాన్ని కోల్పోవద్దు.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. గోవిందాచ్యుత గీతంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….

వరవీణ                                                                                            గోవిందాచ్యుత

కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏼 సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు