కుందగౌర - గీతం
Kunda goura geetam in telugu: “కుందగౌర” శ్రీ పురందర దాసు వ్రాసిన 475,000 గీతాలలో ఒకటి. దీనిని శ్రీ పురందర దాసు, పరమేశ్వరుడిని పొగుడుతూ వ్రాసారు. ఇది సంసృతంలో వ్రాయబడింది.
ఈ గీతం చతురస్ర జాతి రూపక తాళంలో ఉంది. ఇందులో ఒక ధృతం మరియు ఒక లఘువు ఉన్నాయి.
రచన: శ్రీ పురందర దాసు
రాగం: మలహరి (15వ మేళకర్త యైన మాయామాళవగౌళ జన్యం)
తాళం: రూపక తాళం (చతురస్ర జాతి) క్రియలు: 06
కుందగౌర గీతం సాహిత్యం-అర్థం:
పల్లవి:
[ఓ గౌరీ నాయక! నీ జటాజూటం భవనం లాగ ఉంటుంది. నీవు మల్లెపువ్వంత తెల్లగా ఉంటావు. పారిజాత పుష్పాల యొక్క తేనెల సువాసనను వెదజల్లుతూ ఉంటావు].
చరణం 1:
[ఓ పరమేశ్వరా! నీవు బంగారు సింహాసనం మీద కూర్చొని నీ త్రినేత్రాలతో మమ్మల్ని ఎల్లప్పుడూ దయతో చూస్తావు].
చరణం 2:
[ఓ మహా శివ! నీ కిరీటం లాంటి జటాజూటం చంద్రునికి, గంగమ్మకు నివాస స్థలం].
Click here for pdf కుందగౌర గీతం
Click here for English
చిట్క:
మీరు ఏదైనా నేర్చుకొనేటప్పుడు, వేరేవాళ్లు మీ తప్పులు దిద్దుతారని ఎదురుచూడకండి. మీరు నేర్చుకున్నది పాడి రికార్డు చేసి దానిని మరల మీరే విని మీ తప్పులను మీరే సరిదిద్దుకోండి. ఇలా చెయ్యడం వలన మీరు నేర్చుకొనే దాని మీద మీకు మంచి పట్టు ఉంటుంది.
కెరయ నీరను గీతంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
← శ్రీ గణనాధ కెరయ నీరను →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.