Maa telugu talliki mallepudanda lyrics in Telugu with meaning

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

Maa telugu talliki mallepudanda lyrics in Telugu with meaning: ఈ పాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం. దీని రచయిత శ్రీ శంకరంబాడి సుందరాచారి.

ఇందులో తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతిని, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించారు.

శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు ఆభేరి రాగంలో మధురంగా పాడిన ఈ పాటను, తను ప్రైవేటుగా గ్రామఫోన్ రికార్డులో విడుదల చేసిన తరువాత ఈ గీతానికి గుర్తింపు లభించింది.

రచయిత “అమరావతి గుహల అపురూప శిల్పాలు” అన్నారు, కానీ అక్కడ గుహలు లేనందున తరువాతి కాలంలో “అమరావతి నగర” అని సవరించి పాడడం మొదలు పెట్టారు.

Aabheri Ragam - Maa telugu talliki mallepudanda
ఆభేరి రాగం ఆరోహణం & అవరోహణం
Maa telugu talliki mallepudanda lyrics
మా తెలుగు తల్లికి మల్లెపూదండ - సాహిత్యం

మా తెలుగు తల్లికి మల్లెపూదండ – సాహిత్యం అర్థం:

మన తెలుగు తల్లికి మల్లెపూల దండ, మాకు జన్మనిచ్చిన తల్లికి హారతి. బంగారం వంటి పంటలను పండిస్తూ, కళ్లలో దయతో, చిరునవ్వుతోనే సిరి సంపదలను ప్రవహింపజేసే ఓ తల్లీ నీకు మా వందనాలు.

జీవం, చైతన్యంతో నిండిన గోదావరి నది ఉత్సాహంగా ప్రవహిస్తుంటే, హడావిడిగా ఉన్నట్లు కృష్ణానది ఈ నేలపై పరుగులుపెడుతుంటే, బంగారం లాంటి పంటలు పండి, ధాన్యం ముత్యాలవలె దొరులుతాయి.

అమరావతి నగరంలోని అరుదైన శిల్పాలు, శ్రీ త్యాగరాజ స్వామి గాత్రంలో తిరుగాడే పాటలు, రచయిత తిక్కన సోమయాజి కలములోనుంచి జారువాడే అద్భుత రచనలు, శాశ్వతంగా ఈ భూమిపై ఉండేటట్లు…

రాణి రుద్రమదేవి బలం, మల్లమ్మ నిష్ఠ, మంత్రి తిమ్మరసు చాకచక్యం, శ్రీ కృష్ణదేవరాయల వైభవం మొదలగు వ్యక్తుల గొప్పతనం  ఈ నేలపై మరియు మా చెవులలో ఎల్లప్పుడూ మారుమ్రోగేటట్లు వారి కీర్తినే పాటలుగా పాడుతాం, దానికి సంబంధించిన ఆటలనే ఆడుతాం. అలాంటి గొప్ప బిడ్డలను కన్న మా తెలుగుతల్లికి జయము.

Click here for the pdf మా తెలుగు తల్లికి మల్లెపూదండ – దేశభక్తి గీతం (Maa telugu talliki mallepudanda lyrics in Telugu)

And click here for English

చిట్క:

జాతీయ గీతాల గొప్పతనం గూర్చి తెలుసుకోండి: ఇప్పుడు జాతీయ గీతాలు పాడేటప్పుడు మనకు ఎక్కువగా గుర్తొచ్చేది సైనికులు, కానీ స్వాతంత్య్రం రాకముందు మరియు వచ్చిన కొత్తలో భారతదేశ ప్రతీ పౌరుడు జాతీయ గీతంలో ఒక భాగమే.

ప్రతీ వ్యక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పరరాజ పాలన నుండి భారతదేశాన్ని విడిపించడానికి పోరాడినవాడే. అందుకే ఈ గీతాలను పాడేటప్పుడు వారి త్యాగం, శ్రమ, కృషి, పట్టుదలను ఒక్కసారి గుర్తుచేసుకొని పాడండి.

అలా పాడితే అది పదిమందిని చైతన్యవంతులను చేసి మీ పాటలో పాలు పంచుకునేలా చేస్తుంది. అన్ని సందర్భాలలో అలా జరగకపోవచ్చు కానీ అలా జరిగే అవకాశం తప్పక వస్తుంది. అప్పుడు మీరు పొందే అనుభూతి వర్ణనాతీతం. మీరు చక్కగా పాడి దేశ గౌరవాన్ని చాటుతారని ఆశిస్తూ జై హింద్….

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….

జయతి జయతి భారత మాత                                                                         స్వతంత్ర భారత జనని

కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు