మందర ధారే – గీతం
Mandara dhare Geetham పదిహేడవ శతాబ్దపు సుప్రసిద్ధ స్వరకర్త శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి స్వరపరిచిన సరళమైన గీతాలలో ఒకటి. ఇతను కృష్ణుడు (ఉదా: మంధర ధారే) మరియు శివుడిపై స్వరపరిచినప్పటికీ, చాలా పాటలు/గీతాలు రాముడిని స్తుతిస్తూ వ్రాసారు. ఈ గీతంలో కవి శ్రీకృష్ణుని స్తుతిస్తున్నాడు. ఇది సంస్కృతంలో వ్రాయబడింది.
ఈ గీతం ఆది తాళంలో ఉంది. ఇది ఒక లఘువు మరియు రెండు ధృతాలను కలిగి ఉంటుంది.
రచన: శ్రీ పైడాల గురుమూర్తి శాస్త్రి
రాగం: కాంభోజి (28వ మేళకర్త “హరి కాంభోజి” జన్యం), అన్యస్వరం కాకలి నిషాదం.
తాళం: ఆది తాళం క్రియలు: 8



సాహిత్యం-అర్థం:
ఓ మందర పర్వతం (మందర) మోసేవాడా (ధారే), మోక్షాన్ని ప్రసాదించే ఓ మురారి (మోక్షము రారే), రాక్షస జాతి (దైత్య కుల) విధ్వంసక (అంతక), నీ స్వరూపం పవిత్రమైనది (పావన మూర్తే). నీ పాదాలు (పద) శుభాలను (శుభ) కలిగించే గుర్తులు (రేఖ) కలిగి ఉంటాయి. నీ కిరీటంలో (మకుట) నెమలి (మయూర) ఈకను ధరించే ఓ కృష్ణ, మమ్మల్ని దీవించు.
[ఓ మందర పర్వతం మోసేవాడా, మోక్షాన్ని ప్రసాదించే ఓ మురారి, రాక్షస జాతి విధ్వంసక, నీ స్వరూపం పవిత్రమైనది. నీ పాదాలు శుభాలను కలిగించే గుర్తులు కలిగి ఉంటాయి. నీ కిరీటంలో నెమలి ఈకను ధరించే ఓ కృష్ణ, మమ్మల్ని దీవించు].
Click here for pdf మందర ధారే గీతం
Click here for English
చిట్క:
మీరు పాడేది రికార్డ్ చేసుకోండి. మీరు పాడుతున్నప్పుడు, అన్ని అంశాలపై దృష్టి పెట్టడం మరియు మీరు పాడే విధానం గమనించడం కష్టంగా ఉంటుంది. మీరు రికార్డింగ్ చేయడంవలన, దానిని తిరిగి వినడం వలన మీరు పాడే విధానంపై దృష్టి పెట్టవచ్చు. మీరు పాడే టెంపోలలో మార్పులు లేదా మీ పదజాలం మెరుగుపరచబడే ప్రదేశాలను గమనించవచ్చు. ఇలా చేయడంవలన మీరు సాధన చేసేటప్పుడు మీరు రికార్డింగ్లో చేసిన తప్పులను సరిచేసుకోగలుగుతారు.
మీరు సంగీతంలో తొలి అడుగులు వేసేటప్పుడు మీ గురువు మీకు మార్గనిర్దేశం చేయగలరు, ఎల్లకాలం గురువు మీదనే ఆధారపలేము కనుక ఇలా రికార్డు చేసి వినడం ద్వారా మీరు మీ స్వంత గురువుగా మారవచ్చు.
ఆనలేకర గీతంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏻 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.