ముద్దుగారే యశోద – అన్నమాచార్య కీర్తన
Muddugare Yashoda lyrics in telugu: ముద్దుగారే యశోద అన్నమాచార్య కీర్తన, ఈ పాటలో వేంకటేశ్వర స్వామి కృష్ణావతారంలో చేసిన లీలలను వివరిస్తూ ఆయనను విలువైన రత్నాలతో పోల్చుతున్నారు.
తల్లి యశోదకు ఆ చిన్నికృష్ణుడిడు ముత్యం లాంటివాడు. తన తోటి యాదవులకు మాణిక్యం లాగా మరియు వృష్ణి రాజ్యం యొక్క నిరంకుశ పాలకుడైన కంసుడిని చంపడానికి వజ్రం వలె బలంగా ఉన్నట్లు చెప్తున్నారు.
శ్రీ కృష్ణుని భార్య రుక్మిణి పెదవులపై పగడము లాగా, శంకు మరియు చక్రాల నడుమ ఉన్న వేంకటేశ్వర స్వామి వైడూర్యం లాగా ఉన్నాడు.
కాళింగుని శిరస్సుపై నృత్యం చేస్తున్నప్పుడు పుష్యరాగం (పసుపు నీలమణి) వలె ప్రకాశిస్తున్నాడు, మరియు వేంకటేశ్వరుని రూపంలో ఉన్నప్పుడు ఇంద్రనీలంలాగా ఉన్నాడు.
మొత్తం మీద, అతను వివిధ పరిస్థితులలో వివిధ విలువైన రత్నాలవలె ప్రకాశిస్తూ ఎల్లప్పుడూ భక్తులకు సహాయం చేస్తూ ఉన్నాడు.
ముద్దుగారే యశోద
రచన: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య రాగం: కురంజి
తాళం: ఏక తాళం క్రియలు: 4
ముద్దుగారే యశోద-అర్థం:
పల్లవి: చిన్ని కృష్ణుడు యశోద యొక్క ప్రాంగణంలోని ముత్యంలాంటి వాడు, అతని మీద ఆమె ఎనలేని ప్రేమను కురిపిస్తుంది. అతను ఎవరి గొప్పతనమైతే చాలా ప్రతిష్ట చెందిందో ఆ దేవకి కన్న కొడుకు.
“ఇక్కడ అన్నమాచార్య కృష్ణుని ఇద్దరి తల్లుల గురించి వివరిస్తున్నాడు. యశోద పెంపుడు తల్లి, అతను తన మేనమామ అయిన కంసుడిని చంపి, తనకు జన్మనిచ్చిన తల్లి దేవకిని కలిసే వరకు అతనిని ప్రేమతో పెంచింది. కాబట్టి అన్నమయ్య యశోదను ప్రేమగా, ఆప్యాయంగా పెంచే తల్లిగాను, మరో మాటలో చెప్పాలంటే దయగల స్త్రీ అని వర్ణించాడు. కృష్ణుడు యశోద ఇంట్లో పెరిగాడు కాబట్టి, అతను ఆమె ఇంటి ప్రాంగణంలో ముత్యంలాగా ఉన్నాడని కవి వివరిస్తున్నాడు.
కృష్ణుడికి జన్మనివ్వడానికి దేవకి అనేక కష్టాలు మరియు అద్భుతాలను చవిచూడాల్సి వచ్చింది అలాంటి గొప్ప కీర్తి కలిగిన తల్లి యొక్క బిడ్డ ఈ శ్రీ కృష్ణుడు అని కవి చెప్తున్నారు”.
ఈ చరణంలో అన్నమయ్య ఒకే సమయంలో యశోద, దేవకి మరియు కృష్ణుల గొప్పతనాన్ని వివరిస్తూ స్తుతించాడు.
చరణం 1: అతను ప్రతీ (చిన్న మరియు పెద్ద) గోపిక అరచేతిలో మాణిక్యం లాంటి వాడు. నిరంకుడు, మొండివాడైన కంసునికి వజ్రం లాంటి వాడు, మూడు లోకాలలో పచ్చని రంగులో ఉండే పూస వలె ప్రకాశిస్తున్నాడు, అతను మరెవరో కాదు మనలో ఒకడిగా ఉన్న చిన్ని కృష్ణుడే.
“ఈ చరణంలో, అన్నమయ్య చిన్నికృష్ణుడు ఎంత గొప్పవాడైనా బృందావనములో అందరితో పాటు కలిసిపోయి అందరికి ఆత్మీయుడిగా ఎలా ఉన్నాడో తెలియజేస్తున్నారు”.
చరణం 2: మనలను ఎల్లప్పుడూ రక్షించే చిన్ని కృష్ణుడు భార్య రుక్మిణికి, ఆమె పెదవిమీద పగడం, గోవర్ధన పర్వతం యొక్క హెసోనైట్ రాయి, ‘శంఖు’ మరియు ‘చక్రం’ మధ్య శాశ్వతంగా ఉండే వైఢూర్యము వంటి వాడు.
చరణం 3: బాలుడిలా మన మధ్యలో తిరిగే ప్రపంచానికి మూలమైన పద్మనాభుడు, కాళింగుని తలల మీద వ్యాపించిన పసుపు రంగులో ఉండే మణి; వేంకటగిరి మీద నీలి రంగులో ఉండే విలువైన రాయి, క్షీర సముద్ర మధనం జరిగినప్పుడు బయటికి వచ్చిన కల్పవృక్షం, కామధేనువు, అమృతం లాంటి వాటన్నింటికంటే కూడా గొప్పదైన, ప్రత్యేకమైన రత్నం లాంటి వాడు.
Click here for pdf ముద్దుగారే యశోద
Click here for English
చిట్క:
మీరు ఏదైనా పాట నేర్చుకునేటప్పుడు ఆ పాట పరిస్థితి వెనుక ఉన్న కథ మీకు తెలిస్తే తప్ప మీరు పాట యొక్క ఖచ్చితమైన అర్థం చేసుకోలేరు. మీరు నేర్చుకుంటున్న పాటలకు సంబంధించిన కథలను చదవండి, ఇలా చేయడం వలన మీరు పాటను పూర్తిగా ఆకళింపు చేసుకోగలుగుతారు.
ఉదాహరణకు పై పాట చూడండి అందులో చాలా కథలు దాగి ఉన్నాయి. మీరు కృష్ణుడు, యశోద, దేవకి, కంసుడు, రుక్మిణి మొదలైన వారి గురించి తెలుసుకోవాలి. ఈ ప్రత్యేకమైన పాటను బాగా అర్థం చేసుకోవడానికి మీరు వివిధ రత్నాల గురించి కూడా తెలుసుకోవాలి, లేకపోతే మీరు నేర్చుకున్నదానికి పరిపూర్ణత చేకూరదు.
నారాయణతే నమో నమో పాటలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
← అదివో అల్లదివో శ్రీహరివాసము నారాయణతే నమో నమో →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏻 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.