నగుమోము గలవాని
(త్యాగరాజ స్వామి కీర్తన)
Nagumomu galavani lyrics in Telugu with meaning: ఈ కీర్తన శ్రీ త్యాగరాజ స్వామి వారు స్వరపరిచిన కీర్తనలలో ఒకటి. ఇది 22వ మేళకర్త రాగం ఖరహరప్రియ జన్యమైన మధ్యమావతి రాగంలో స్వరపరచబడింది.
ఇక్కడ త్యాగరాజ స్వామి వారు ఆ శ్రీ రామచంద్రుని రూపాన్ని, అందాన్ని చక్కగా వర్ణించారు.
పంచరత్న కృతులకు అత్యంత ప్రసిద్ధి చెందిన త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు కర్ణాటక సంగీత త్రిమూర్తులు.
నగుమోము గలవాని – సాహిత్యం అర్థం:
పల్లవి: ఎల్లప్పుడూ నవ్వు ముఖం కలిగిన, నా హృదయాన్ని దొంగిలించిన, ఈ విశ్వాన్నంతటిని పాలించే పరాక్రమం కలిగిన వీరుడు మరియు సీతమ్మ (జనక మహారాజు కుమార్తె) తల్లికి భర్త అయిన ఆ శ్రీరామచంద్రునికి వందనాలు.
చరణం-1: దేవుళ్ళకే దేవుడు, అత్యంత అందమైన వాడు, వాసుదేవునిగా పిలవబడే శ్రీకృష్ణుడు, రఘు వంశంలో పుట్టి సీతాదేవిని పెండ్లి చేసుకున్న ఆ శ్రీరామచంద్రునికి వందనాలు.
చరణం-2: మంచి జ్ఞాన సంపద కలిగినవాడు, చంద్రుడు మరియు సూర్యుడు కళ్ళుగా కలిగినవాడు, అజ్ఞానం అనే చీకటిని దూరం చేసే సూర్యుడైన ఆ శ్రీరామచంద్రునికి వందనాలు.
చరణం-3: నిష్కళంక స్వరూపుడు, సర్వ పాపాలను నాశనం చేసేవాడు, మరియు ధర్మబద్ధమైన ప్రవర్తన, విముక్తి మొదలైనవాటిని ప్రసాదించే గొప్పవాడైన ఆ శ్రీరామచంద్రునికి వందనాలు.
చరణం-4: ఆ శ్రీ రామచంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకున్న నేను పదే పదే ఆయన్ని పూజించే, కొలిచే, కీర్తించే అదృష్టం కలగడం నా పూర్వ జన్మ సుకృతం.
Click here for pdf నగుమోము గలవాని (Nagumomu galavani lyrics in Telugu)
And click here for English
చిట్క:
సందర్భానికి తగ్గ పాటలు పాడండి: మనం సంగీతం నేర్చుకుంటున్నాం అని ఎవరికైన చెప్పినప్పుడు పాట పాడమని అడగడం సర్వసాధారణం. అయితే సందర్భాన్ని అనుసరించి పాటలు పాడడం అనేది మనకు తెలియాలి.
అందుకే మనం నిశ్చితార్థం,పెళ్లి, అప్పగింతలు, శ్రీమంతం, బారసాల పాటలు నేర్చుకోవాలి. వాటితో పాటు ….
మన దేవుళ్ళ పాటలు పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శివుడు, విష్ణుమూర్తి, గణేష్, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇలా అన్ని దేవుళ్ళ పాటలు నేర్చుకొని సమయానుసారం పాడితే అందరి మన్ననలను మరియు ఆ దేవతల ఆశీర్వాదాలను పొందుతాం.
మీరు పొందే ఆనందం కూడా వర్ణనాతీతం.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← సీతా కళ్యాణ వైభోగమే తరువాత →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏼 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
ధన్యవాదాలు