ఓంకార రూపిణి - అమ్మవారి పాట
Omkara rupiNi lyrics in Telugu with meaning: ఈ పాట మహిషాసురమర్దిని అయిన పార్వతీ దేవి మీద వ్రాయబడింది. ఇక్కడ కవి ఆ దేవిని వివిధ పేర్లతో పొగుడుతూ మనల్నందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాడు.
ఓంకార రూపిణి – సాహిత్యం అర్థం:
పల్లవి: ఓ పార్వతీ, నీవు ఓంకార రూపానివి, బీజ మంత్రమైన క్లీంకార మంత్రాలలో ఉండేదానివి, ఈ లోకానికే దేవతవి మరియు ప్రకృతి యొక్క స్వరూపాణివి.
అనుపల్లవి: శివుని శరీరంలో సగ భాగానివి, ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నదానివి. నీ భక్తుల పాపాలను పోగెట్టే శక్తివి, బ్రహ్మ దేవుడి ఇంటికి యజమానురాలివి (సరస్వతి దేవి-బ్రహ్మాండ మహాపురాణంలోని లలితోపాఖ్యానం ప్రకారం పార్వతి, లక్ష్మీ, సరస్వతులు లలితా దేవి యొక్క అవతారాలు).
చరణం: మృగరాజైన సింహాన్ని వాహనంగా, నటరాజ స్వామికి సుగుణవతైన ఇల్లాలుగా, శివుని సగ భాగంగా చక్కగా ఆభరణంలా ఇమిడి ఉన్న పరమేశ్వరివి. సమస్త జీవరాసుల అభ్యర్థనలను తీర్చే ఓ కాశీపుర కామాక్షి, మధుర* మీనాక్షి, ప్రేమను కురిపించే పార్వతి మమ్మల్ని కరుణించు తల్లి.
*(మాధురి అంటే చక్కని అనే అర్థం కూడా ఉంది, అప్పుడు చక్కని, అందమైన మీనాక్షి అని కూడా చెప్పుకోవచ్చు)
Click here for pdf ఓంకార రూపిణి_సాహిత్యం
Click here for English
చిట్క:
చాలా మంది మాకు సంగీతం/నాట్యం అంటే చాలా ఇష్టం మేము నేర్చుకోలేకపోయాము అందుకే పిల్లలకైనా నేర్పించాలనుకుంటున్నాం అని నా దగ్గరికి వస్తారు. వాళ్లకు నేను చెప్పేది సంగీతం/నాట్యం ఒక వయసు వాళ్లకు మాత్రమే పరిమితం కాదు ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు ఇష్టం ఐతే మీరు కూడా నేర్చుకోండి అని.
సమయం లేకపోవడం కూడా ఒక సమస్య, ఐతే మొదట్లో కష్టంగా అనిపించొచ్చు గాని, ఒకసారి మొదలుపెట్టాక మీకు తెలియకుండానే క్లాస్ కి రావడం అనేది అలవాటైపోతుంది. దానికి తోడు ఇష్టమైనది నేర్చుకుంటున్నారు కనుక కష్టంగా అనిపించదు.
మీరు నేర్చుకుంటున్నది సంగీతం/నాట్యం కనుక మీ జీవితంలో జరిగే ప్రతీ శుభకార్యంలో ఈ రెండు ఇమిడి ఉంటాయి. పూజలు, వ్రతాలు చేసుకునేటప్పుడు దేవుని పాటలు పాడుకోవచ్చు. పెళ్ళిళ్ళు, సంబరాలలో డాన్స్ చెయ్యొచ్చు. ఇంకా మీ ఆఫీస్ లో జరిగే వేడుకలలో పాల్గొంటే మీకు ఉండే ఆ ప్రత్యేక గుర్తింపే వేరు.
మనం చనిపోయాక మనల్ని గుర్తుపెట్టుకోవడానికి కొన్ని జ్ఞాపకాలు విడిచిపెట్టడం మన బాధ్యత, అలాంటి జ్ఞాపకాల కోసం మీకు నచ్చినది నేర్చుకొని దానిని ప్రదర్శించి మీ చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని పంచుతారని ఆశిస్తున్నాను.
చాల ఎక్కువ చెప్పాను కదా?? కానీ నేను చెప్పినదాని గురించి ఒక్కసారి ఆలోచించండి.
మీకు ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను, మీకు ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి దిగువ comments sectionలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో కలుద్దాం. నమస్కారం.
← ముందు హారతి మీరేల ఇవ్వరే →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.