పలుకే బంగారమాయెనా
Paluke bangaramayena: ఇది శ్రీరామదాసు కీర్తన, శ్రీరాముడిని తన ప్రార్థనలకు సమాధానం ఇవ్వమని, వచ్చి తన ముందు ప్రత్యక్షమవ్వమని రామదాసు ఈ పాటలో వేడుకుంటున్నాడు.
రచన: శ్రీ రామదాసు రాగం: ఆనందభైరవి
తాళం: ఏక తాళం క్రియలు: 4
పలుకే బంగారమాయెనా సాహిత్యం అర్థం:
పల్లవి: దివ్యమైన కోదండ ధనుస్సును చేతిలో పట్టుకున్న ఓ శ్రీ రామా, నీ మాటలు బంగారమంత అపురూపమైపోయాయి..
చరణం 1: నేను నిన్ను ఎంత పిలిచినా నువ్వు పలకడం లేదు. నీ మాటలు అంత అపురూపమైపోయాయి. ఓ అందమైన నా తండ్రీ, కలలో కూడా నీ నామాన్ని స్మరించడం మరువలేదు శ్రీ రామా.
చరణం 2: రామసేతును నిర్మించడంలో మీకు సహాయం చేయడానికి ఇసుకలో దొర్లుతున్న ఉడుత చూపిన భక్తికి మెచ్చి నీవు దయతో దానిని దగ్గరకు తీసుకున్నావు, అటువంటి నిన్ను నేను నమ్ముకున్నాను ఓ శ్రీ రామ చంద్ర!
చరణం 3: ఓ శ్రీ రామ! శాపంతో రాయిగా మారిన అహల్యను నీ పాదస్పర్శతో ఆమె నిజ రూపాన్ని ప్రసాదించావనే గొప్ప కీర్తిని ఈ ప్రపంచంలో కలిగిఉన్నావు, అలాంటి నిన్ను నేను మనసారా నమ్ముతున్నాను ఓ తండ్రి!
చరణం 4: ఎంత ప్రాధేయపడినా నా మీద కొంచెం కూడా నీకు కరుణ కలగడం లేదు, మొండిగా పంతానికి పోవడానికి నీ ముందు నేనెంతటి వాడిని రఘు రామ!
చరణం 5: నీ ఆశ్రయం కోరిన వారిని దగ్గరకు తీసుకుంటావని పేరు నీకు, అదేవిధంగా ఈ భద్రాచల రామదాసుడికి కూడా నీవే కరుణించి ఆశ్రయం కల్పించు ఓ దశరథ రామ!
Click here for pdf పలుకే బంగారమాయెనా
Click here for English
చిట్క:
సంగీతాన్ని ఎక్కువగా వినడంతోపాటు, సంగీతానికి సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడం వల్ల మీరు నేర్చుకుంటున్న వాటిని సందర్భోచితంగా ఉపయోగించడం/పాడడంలో సహాయపడుతుంది. మీరు నేర్చుకుంటున్న దానికి సంబంధించి పూర్వ విషయాలు తెలుసుకోవడం ద్వారా వాటిని నేర్చుకోవడం సులభతరం అవుతుంది. సంగీత చరిత్ర, కాలక్రమేణా సంగీతాన్ని రూపొందించడంలో మారుతున్న తత్వాలను మీకు చూపుతుంది.
రామచంద్రాయ జనక పాటలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
← బంటు రీతి కొలువు రామచంద్రాయ జనక →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.