రామ లాలి మేఘ శ్యామ లాలి
(శ్రీరామదాసు కీర్తన)
Rama laali megha shaya lali lyrics in Telugu with meaning: చిన్ని రాముడి కొంటె చేష్టలను వివరిస్తూ శ్రీ రామదాసుచే తెలుగు భాషలో రచించబడిన చాలా ప్రజాదరణ పొందిన కీర్తన ఇది.
భక్త రామదాసు లేదా భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి చెందిన కంచర్ల గోపన్న, 17వ శతాబ్దానికి చెందిన శ్రీ రామ భక్తుడు, కవి మరియు కర్ణాటక సంగీత స్వరకర్త.
ఇతను తెలుగు శాస్త్రీయ యుగం నాటి ప్రసిద్ధ వాగ్గేయకారుడు (సాహిత్యాన్ని రాసి దానికి సంగీతాన్ని కూడా సమకూర్చేవారు).
తెలుగు చరిత్రలో ఈయన జీవితం గురించి వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నది ఒడ్డున ప్రసిద్ధ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించడంలో ఇతను ప్రసిద్ధి చెందాడు.
శ్రీ రామునిపై భక్తితో రచించిన ఇతని కీర్తనలు పల్లవి, అనుపల్లవి మరియు చరణం శైలిలో ఎక్కువగా తెలుగులో, కొన్ని సంస్కృతంలో మరియు అప్పుడప్పుడు తమిళ భాషలో స్వరపరచబడ్డాయి.
ఈ కీర్తనలు దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో శ్రీ రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి.
రామ లాలి మేఘ శ్యామ లాలి – సాహిత్యం అర్థం:
పల్లవి: నీలి మేఘ వర్ణ మేను ఛాయ, తామరపువ్వు రేకుల వంటి కన్నులు కలిగిన, దశరథ మహారాజు కుమారుడైన శ్రీ రాముడికి లాలి.
చరణం-1: వికసించిన తామరపువ్వు వంటి ముఖం గల రామా, నీవు ఆటలు ఆడి అలసిపోయావు కనుక కడుపులో ఆహారం జీర్ణమయ్యే వరకు నిదురపోవయ్య.
చరణం-2: నీ వీపు మీద తడుముతూ లాలీ పాట పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకుని వింటావు, నిద్రపోయావని భావించి ఆగిపోతే మేల్కొని కొనసాగించమని సైగ చేస్తావు.
చరణం-3: నేను నిన్ను ఎప్పుడూ ఎత్తుకోవడం అలవాటయింది, ఏమి చెయ్యాలి ఈ స్త్రీలు నిన్ను తాకకుండా తమని తాము అదుపుచేసుకోలేరు, కేవలం వాళ్ల చేతి స్పర్శకే నీ సున్నితమైన చర్మం కందిపోతుంది.
Click here for pdf రామ లాలి మేఘ శ్యామ లాలి (Rama laali megha shaya lali lyrics in Telugu)
And click here for English
చిట్క:
సంగీతం నేర్చుకునేటప్పుడు ఆనందించండి: మీరు నేర్చుకొనే సంగీతం మీకు ఆనందాన్ని కలిగించాలి. చేసే అభ్యాసం కూడా సరదాగా సాగాలి.
అలాగే, మొదటి నుంచి కూడా ఏ సంగీతాన్ని అయితే మీరు వింటూ ఆనందిస్తారో అదే సంగీతాన్ని నేర్చుకొని పాడండి:
“మనసుకు నచ్చిన సంగీతాన్ని నేర్చుకోండి ఇది మన సాధనను కొనసాగించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది”.
ఎలాంటి సంగీతాన్ని వింటున్నాం, ఎవరు రచించారు, స్వరకర్త, పాడినవారు మొదలైనవాటి మీద కూడా ద్యాస పెట్టండి.
మరియు గాయకుడి శ్రావ్యమైన స్వరం, సంగీత వాయిద్యాలు (గిటార్, సోలో, పియానో, వయోలిన్) నుండి వచ్చే శ్రావ్యత మొదలైన వాటి మీద కూడా శ్రద్ధ పెట్టడం వలన సంగీతాన్ని మనసుకు హత్తుకునేలా నేర్చుకొని పాడగలుగుతారు.
పెద్దవాళ్ళు ఎలాంటి సంగీతాన్ని వినాలి, నేర్చుకోవాలి అనే దాని మీద కొంత వరకు అవగాహనను కలిగి ఉంటారు కానీ పిల్లలకు అంతగా తెలియదు కనుక వారి మీద మరింత దృష్టి పెట్టాల్సివస్తుంది.
సంగీత సాధన వినోదభరితంగా ఉండడానికి సరైన సంగీతాన్ని ఎంచుకోవడం అనేది మొదటి అడుగు.
నచ్చిన సంగీతాన్ని ఎంచుకోండి, ఆనందాన్ని పొందండి మరియు ఆనందాన్ని పంచండి.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← రామచంద్రాయ జనక తరువాత →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏼 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.