సీతా కళ్యాణ వైభోగమే
(త్యాగరాజ కీర్తన)
Sita kaLyana vaibhogame lyrics in Telugu with meaning: సీతా కళ్యాణ వైభోగమే కీర్తన శ్రీ త్యాగరాజ స్వామి స్వరపరిచిన కీర్తనలలో ఒకటి. ఇది శంకరాభరణ రాగం, ఝంపె తాళంలో స్వరపరచబడిన ఉత్సవ సంప్రదాయ కీర్తన.
పంచరత్న కృతులకు అత్యంత ప్రసిద్ధి చెందిన త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు కర్ణాటక సంగీత త్రిమూర్తులు.
సీతా కళ్యాణ వైభోగమే – సాహిత్యం అర్థం:
పల్లవి: ఓ భక్తులారా! శ్రీ రామునితో సీతాదేవికి జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని చూసి తరించండి.
చరణం-1: పవిత్రమైన రామాయణంలో తన వంతు సహకారాన్ని అందించిన వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడిచే స్తుతించబడి, అందమైన సూర్య చంద్రులనే కన్నులుగా కలిగిన అపురూపమైన శరీరం కలిగిన శ్రీ రామునితో, సీతమ్మ తల్లికి జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని చూసి తరించండి.
చరణం-2: విస్తారమైన బాణాలు కలిగినవాడై, భక్తులను రక్షించే; ఈ ప్రపంచంలో నాటకీయంగా కలిగే సుఖాలను మరియు మోక్షాన్ని ప్రసాదించే, భువిలో దేవతలతో సమానమైన బ్రాహ్మణులను కాపాడే ఆ శ్రీ రామునితో, సీతమ్మ తల్లికి జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని చూసి తరించండి.
చరణం-3: మూర్ఖులకు మరియు రాక్షసులకు భయాన్ని కలిగించే; మన కోరికలన్నింటినీ తీర్చే, ఈ లోకంలో అందరిచేత అభిమానించబడే, అయోధ్యలో నివసించే, నీలి మేఘ వర్ణ ఛాయ కలిగిన ఆ శ్రీ రామునితో, సీతమ్మ తల్లికి జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని చూసి తరించండి.
చరణం-4: విశ్వానికంతటికి ఆధారమైనవాడు; యుద్ధాన్ని గెలిచే వీరుడు; మనుషుల మనసులలో ఉండే అహంకారాన్ని దూరం చేసేవాడు; మేరు పర్వతం (బంగారు పర్వతం) వలె ప్రపంచానికి మూల స్తంభం లాగ నిలబడే ధీరుడైన శ్రీ రామునితో, సీతమ్మ తల్లికి జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని చూసి తరించండి.
చరణం-5: వేదాలు మరియు శాస్త్రాలలో నివసించే, సాటిలేని శరీరం కలిగిన వాడు; భువిలో నివసించే భక్తుల కొండంత పాపాలనైన నాశనం చేసేవాడు; తల వంచి ప్రార్థించే ప్రజలకు మద్దతుగా నిలిచే శ్రీ రామునితో, సీతమ్మ తల్లికి జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని చూసి తరించండి.
చరణం-6: శివుని చేత స్తుతించి, కీర్తించబడిన వాడైన; ఈ సంసార సాగరాన్ని దాటడానికి నౌకలాగా సహాయం చేసేవాడైన; సూర్య వంశంలో జన్మించిన; ఈ త్యాగరాజు చేత స్తుతించబడుతున్న శ్రీ రామునితో, సీతమ్మ తల్లికి జరుగుతున్న కళ్యాణోత్సవాన్ని చూసి తరించండి.
Click here for pdf సీతా కళ్యాణ వైభోగమే (Sita kaLyana vaibhogame lyrics in Telugu)
Click here for English
చిట్క:
మీకు పాడటం ఇష్టమా?
మీరు ఏదో ఒక రోజు వేదికపై ప్రదర్శన ఇవ్వాలని కలలు కంటున్నారా?? లేదా పాడాలనే మీ అభిరుచిని పెంపొందించుకోవాలని అనుకుంటున్నారా??
అయితే ఆలస్యం చెయ్యకండి.
బాగా ఎలా పాడాలో ఎవరైనా నేర్చుకోవచ్చు.
పాడటం గురించి కొన్ని సాధారణ దురభిప్రాయాలు ఏమిటంటే, గొంతు బాగోలేదని, మీరు కాకుండా మీ ఇంట్లో ఎవరికి కూడా పాడే అలవాటు లేదని….
మనకు వేమన కవి చెప్పినట్టు “తినగ తినగ వేము తియ్యనుండు” అలాగే పాడగా పాడగా పాట వినసొంపుగా మారుతుంది.
వాస్తవం ఏమిటంటే స్వర శిక్షణ సాధారణ గాయకులను ఔత్సాహిక గాయకులుగా తీర్చిదిద్దుతుంది.
పాడాలని నిర్ణయించుకున్నారా?? అయితే
గురువును ఆశ్రయించండి, స్థిరంగా నేర్చుకోండి మరియు మరింత సాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసంతో పాడగలిగే గాయకులు అవుతారు.
మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← బంటు రీతి కొలువు నగుమోము గలవాని →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏼 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
ధన్యవాదాలు