అర్థం: ఓ దేవా, ఆకాశం (అంబర) వలె తెల్లని (శుక్ల) రంగు వస్త్రాలు ధరించి (ధరం), అన్నింటా వ్యాపించి (విష్ణుం), చంద్రుని (శశి) వలె తెల్లని రంగు (వర్ణం) ఛాయ కలిగి, నాలుగు (చతుర్) చేతులు (భుజం) కలిగి, ప్రశాంతమైన (ప్రసన్న), సంతోషకరమైన ముఖం (వదనం) కలిగిన నిన్ను మేము ఆరాధిస్తున్నాం (ధ్యాయేత్), దయతో మాకు ఎదురయ్యే అన్ని (సర్వ) అడ్డంకులను (విఘ్నోప) తొలగించండి (శాంతయే).
అర్థం: ఏనుగు (గజ) ముఖం (అనన) తో ఉన్న ఓ ప్రభూ, ఎవరి ముఖం చూసినపుడు తల్లి పార్వతిదేవి (అగజ – పర్వతం నుండి జన్మించినది/పర్వత రాజు కుమార్తె) ముఖం (అనన), సూర్యుని (అర్కం) కాంతి వలన విచ్చుకున్న అందమైన కమలం (పద్మ) వలె ప్రకాశిస్తుందో అటువంటి నిన్ను మేము ఎల్లప్పుడూ (అహర్నిశం) ధ్యానిస్తాము, ఆరాధిస్తాము (ఉపాస్మహే), నీవు (తం) నీ భక్తులకు (భక్తానామం) పుష్కలంగ (అనేక) వరాలను (దం) ఇచ్చేవాడివి, ఓ ఏకదంత మమ్మల్ని ఆశీర్వదించండి.
సుప్రభాత శ్లోకం
అర్థం: మనం సంపద కోసం పూజించే లక్ష్మీ దేవి మన అరచేతి కొనపై (కరాగ్రే) నివసిస్తుంది (వసతే), జ్ఞానం కోసం పూజించే సరస్వతీ దేవి చేయి మధ్యలో (కర-మధ్యే) ఉంటుంది, మరియు ధైర్యం కోసం మనం పూజించే గౌరీ దేవి చేతి మూలలో (కర-మూలే) ఉంటుంది (స్థితా), అందువలన ప్రతిరోజూ ఉదయాన్నే (ప్రభాతే) మనం మన అరచేతులను (కర) చూసుకొని (దర్శనం) ధ్యానించాలి.
దీప ప్రజ్వలన శ్లోకం
అర్థం: మనకు మంచిని (శుభం), సంక్షేమాన్ని (కళ్యాణం), ఆరోగ్యాన్ని (ఆరోగ్యం), ధనాన్ని (ధన) మరియు సంపదను (సంపద) ఇచ్చి (కరోతి), మన శత్రువుల (శత్రు) చెడు మనస్తత్వాన్ని (బుద్ధి) నాశనం (వినాశాయ) చేసే దీపానికి (దీప-జ్యోతిర్) నా నమస్కారాలు (నమోస్తుతే).
శివుని శ్లోకం
అర్థం: నేను (అహం) సర్వవ్యాప్తిని (నిర్వికల్పం) మరియు ఎటువంటి రూపం లేని వాడిని (నిరాకార రూపం), నేను భస్మం (విభుర్) రూపంలో ప్రతిచోటా (సర్వత్ర) మరియు అన్ని (సర్వ) శరీర ఇంద్రియాలలోను (ఇంద్రియాణాం) వ్యాపించి (వ్యాప్తి) ఉన్నాను. నాకు ప్రపంచంలో, ముక్తి లేదు (న ముక్తే), అనుబంధాలు లేవు (న బంధః) ఎల్లప్పుడూ (సదామే) అన్ని/అందరు సమానమే (సమత్వం). మనసులో ఎప్పుడు ఆనందంగా ఉండే నేను (చిదానంద రూపః) శివుడిని (శివోహమ్).
శ్రీ రామ శ్లోకం
అర్థం: “రామ రామ రామ” (రామ నామం) గురించి ధ్యానించడం ద్వారా, నా మనస్సు రాముడి యొక్క దివ్య చైతన్యంలో లీనమవుతుంది, ఇది అతీంద్రియమైనది. భగవంతుని వేయి నామాల (విష్ణు సహస్రనామ-స్తోత్రం) అంత గొప్పది రామ నామం.
శ్రీ కృష్ణ శ్లోకం
అర్థం: విశాలమైన (ఫలకే) నుదుటి (లలాట) మీద మంచి సువాసన (కస్తూరి) గల తిలకం (తిలకం), ఛాతీ (వక్ష:స్థలే) మీద సముద్ర మంథనం సమయంలో పొందిన కౌస్తుభ మణి (కౌస్తుభం), ముక్కు కొనపై (నాసాగ్రే) ముత్యం (నవ మౌక్తికం) తో చేసిన నత్తు, చేతులు (కరే) కంకణాలతో (కంకణం) అందంగా అలంకరించబడి, మృదువైన అరచేతిలో (కరతలే) పిల్లనగ్రోవి (వేణుం) మరియు శరీరమంతా (సర్వాంగే) గంధం (హరిచందనం చ) అభిషేకం చేసినట్లుగా పూసుకొని (కలయం), మెడ (కంఠేచ) లో ముత్యాల హారంతో (ముక్తావళిం) అలంకరించబడిన శ్రీ కృష్ణడు (గోపాల), వేడుకతో (విజయతే) గోపిక స్త్రీల (గోపస్త్రీ) సమూహంలో (పరివేష్టితో) తలపై అలంకరించబడిన రత్నం (చూడామణిం) లా ప్రకాశిస్తున్నాడు.
వేర్వేరు సమయాలు మరియు సందర్భాల కోసం మనకు వేర్వేరు శ్లోకాలు ఉన్నాయి. మీరు శ్లోకాలు నేర్చుకుంటే, మీరు నేర్చుకోవాలనుకుంటున్న లేదా తెలుసుకోవాలనుకునే ఏ భాషలోనైనా మీ ఉచ్చారణ మెరుగుపడుతుంది.
నేను డాన్స్ కూడా నేర్పిస్తాను కానీ, వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద మాత్రమే. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.