స్వతంత్ర భారత జనని
Swatantra bharata janani lyrics in Telugu with meaning: ఈ పాటలో కవి భారతమాతకు నీరాజనాలు అర్పిస్తూ ఆమె గొప్పతనాన్ని చక్కగా వివరించారు.
స్వతంత్ర భారత జనని – సాహిత్యం అర్థం:
పల్లవి: స్వాతంత్య్రం పొందిన ఓ భరతమాత, నిండైన మనసుతో, శిరీష అనే చెట్టు నుండి వచ్చిన అనేక సున్నితమైన పువ్వులతో, ఆడ మగ తేడా లేకుండా ప్రజలందరిచేత పూజింపబడి, హారతులు అందుకుంటున్న నీకు మా వందనాలు.
చరణం-1: చాలా కాలంగా బానిసలుగా బ్రతుకుతున్న సంకెళ్లు విడిపోయాయి, దీనత్వం అనే చీకటి పొరలు తొలగిపోయాయి. స్వాతంత్య్రం రావడం వలన కలిగిన ఆనందం హిమాలయాలనుండి వచ్చే నీరు ఏ విధంగా పొంగిపొర్లుతుందో ఆ విధంగా దేశమంతటా అలలుగా వ్యాపించింది.
చరణం-2: త్యాగమూర్తైన గాంధీ మహాత్ముడు ఇచ్చిన శాంతి, అహింసలే ఎల్లప్పుడూ మనసులో తలచుకొని, ఈ భారతదేశమంతటిని ఒకటిగా చేస్తామని నిర్మలమైన మనసుతో ప్రతిజ్ఞ చేద్దాం.
Click here for the pdf స్వతంత్ర భారత జనని (Swatantra bharata Janani lyrics in Telugu)
And click here for English
చిట్క:
బ్యాండ్‌లో లేదా గ్రూప్‌లో చేరండి: మనం కొంతమందితో కలిసి పాడడం వలన మనలో లోటు పాటులు మనకు ఇంకాస్త ఎక్కువగా తెలుస్తాయి. మనతో పాటు పాడే వారి సహాయం తీసుకొని మనం ముందుకు వెళతాం ఇంకా చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం కూడా.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
← మా తెలుగు తల్లికి మల్లెపూదండ తేనెల తేటల మాటలతో →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org