తల్లీ భారతి వందనం
(దేశభక్తి గీతం)
Talli bharati vandanam lyrics in Telugu with meaning: తల్లీ భారతి వందనం పాట తెలంగాణకు చెందిన కవి, రచయితైన “దాశరథి కృష్ణమాచార్య” గారిచే రచించబడిన చక్కని దేశభక్తి గీతం. నా తెలంగాణ, కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించిన కవి ఈయన.
చిన్నపిల్లలలో దేశభక్తిని పెంచే, సులభంగా అర్ధమయ్యే పాట ఇది. పిల్లలకు చిన్నతనం నుంచే దేశం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దల పట్ల గౌరవ భావం పెంపొందింపచేయాలి.
భావి భారత పౌరులు, కుల మత భేదం లేక ఒకరినొకరు సోదర భావంతో మెలిగేటట్లు చూడాలి. వాళ్లకు చిన్నతనం నుండి మంచి విషయాల పట్ల అవగాహన కలిగించాలి.
నిద్ర లేవగానే మరియు పడుకునే ముందు తల్లితండ్రుల పాదాలకు నమస్కరించాలని, దైవ ప్రార్థన చెయ్యాలనే భావనలు నాటితే జీవితాంతం వారు మంచి దోవలో నడిచే అవకాశం ఉంది.
‘తల్లీ భారతి వందనం’ సాహిత్యం అర్థం:
పల్లవి: ఓ భారత మాతా! నీకు మా వందనం, నీవు నివసించే ఈ భారతదేశమే మాకు ఉద్యానవనం, నీ ఒడిలో మల్లెపువ్వులలాగా వికసించే మేమందరం నీ పిల్లలము.
చరణం 1: మేము మంచిగా చదువుకొని భారత దేశ గౌరవం పెంచుతాం. తల్లిదండ్రులను గురువులను ఎల్లప్పుడూ పూజిస్తాం.
చరణం 2: కుల మత భేదాలు లేకుండా, ఎలాంటి అరమరికలు, చీకు చింతా లేకుండా కలిసి మెలిసి జీవిస్తాం. మానవులంతా సమానమంటూ ప్రేమాభిమానాలను పెంచుతాం.
చరణం 3: తెలుగువారందరికీ ఇది ఒక శుభోదయం, భారతదేశానికి ఒక కొత్త ఉదయం. మనమంతా రేపటి పౌరులం, భారతదేశ ప్రజలకు జయం జయం.
Click here for pdf తల్లీ భారతి వందనం (talli bharati vandanam lyrics in Telugu)
Click here for English
చిట్క:
అప్పుడప్పుడు నేర్చుకున్నదానిని ఇంకొకసారి చూసుకోండి: మీరు పాటను నేర్చుకోవడం పూర్తి చేసిన తర్వాత అప్పటివరకు నేర్చుకున్న పాటలను ఇంకొకసారి తిరగేయండి. దీనివలన మీరు ఎన్ని నేర్చుకున్నారు, ఎంత వరకు గుర్తుంది, ఎక్కడ ఇంకాస్త కృషి చెయ్యాలో తెలుస్తుంది.
ఇలా చెయ్యడం వలన మున్ముందు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీరు ఎంతవరకు విజయవంతంగా ముందుకు సాగుతున్నారో కూడా తెలుస్తుంది.
మీకు ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి దిగువ comments sectionలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో కలుద్దాం. నమస్కారం.
← భో శంభో శివ శంభో స్వయంభో జయతి జయతి భారత మాత →
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏾 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.