తేనెల తేటల మాటలతో
Tenela tetala matalato lyrics in Telugu with meaning: ఈ పాటలో కవి భారతమాత గొప్పతనాన్ని తెలుసుకొని, ఆవిడ కీర్తిని అచ్చమైన తెలుగులో పాడుతూ అందరం కలిసిమెలిసి జీవనం సాగిద్దాం అని పిలుపునిస్తున్నారు.
తేనెల తేటల మాటలతో – సాహిత్యం అర్థం:
పల్లవి: స్వచ్ఛమైన తేనె వంటి తియ్యని మాటలతో మన దేశమాతని సేవిద్దాం. మన అభిప్రాయాలను, అదృష్టాలను కలగలుపుకొని ఇక నుంచి కలిసిమెలిసి జీవిత ప్రయాణం సాగింద్దాం.
చరణం-1: సముద్రము కొండ నడుముకు వడ్డాణంలాగా చుట్టుకొని, గాలి సుడిలా అనిపించే గంగా నదిని చీరగా మలచుకొన్న మన భారతమాత కీర్తి ప్రతిష్టతలను గురించి పాడుకుంటూ ఆ దేవికి హారతులు ఇద్దాము.
చరణం-2: గంగ శివుని జటాజూటంలో ఎంత వైభవంగా ఉంటుందో అంత ముగ్ద మనోహరంగా హిమాలయ పర్వత శిఖరం నిలబడగా, గలగల మంటూ శబ్దం చేస్తూ పారే నదులన్నీ సామూహిక గానం చేస్తున్నట్టుగా అనిపించే గొప్ప శోభ కలిగిన భారతమాతకు హారతులు ఇద్దాము.
చరణం-3: ఎందరో వీరులు చేసిన త్యాగం ఫలితమే మనం ఈరోజు స్వాతంత్య్రంగా, స్వేచ్ఛగా జీవించడానికి ప్రధాన కారణం. వారందరినీ తలచుకుంటూ మన మనసులో వారిని స్మరించుకుంటూ భారతమాతకు హారతులు ఇద్దాము.
Click here for pdf తేనెల తేటల మాటలతో (Tenela tetala matalato lyrics in Telugu)
And click here for English
చిట్క:
సందేహ నివృతి:
మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు రకరకాల సందేహాలు వస్తాయి, సంగీతం దానికి అతీతమేమీ కాదు. సంగీతం నేర్చుకునేటప్పుడు కూడా రకరకాల సందేహాలు వస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు తీర్చుకుంటూ కొత్త విషయాలను తెలుసుకోవాలి.
మంచి గురువులు ఎప్పుడైనా సందేహాలను తీరుస్తూ, మరిన్ని విషయాలను చెప్పడానికి ఆశక్తి చూపిస్తారు. అలాంటి గురువు దొరికినప్పుడు అస్సలు వదులుకోకండి. కొత్త విషయాలను నేర్చుకుంటూ, మీ సంగీత ప్రయాణాన్ని సుమధురంగా కొనసాగించండి.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపించగలరు. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….
← స్వతంత్ర భారత జనని సారె జహాన్ సె అచ్ఛా →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org