వనమాలి వాసుదేవ
Vanamali vasudeva lyrics in Telugu with meaning: ఇది చాలా ప్రజాదరణ పొందిన శ్రీకృష్ణుని భజన.
పాల కడలి మీద పవళించే ఆ శ్రీ మహావిష్ణువు, వెన్నను దొంగతనం చేసే శ్రీకృష్ణ భగవానుడిగా వెలసి, దీన భక్తులను దగ్గరకు తీసుకొని, వారి కోరికలను తీర్చే పరంధాముడు మరియు రాధ మనసును దోచుకున్న రమణీయ సుగుణధాముడు అని కవి ఎంతో చక్కగా వర్ణించారు.
వనమాలి వాసుదేవ – సాహిత్యం అర్థం:
పల్లవి: వనపుష్పాలతో చేసిన మాలను అలంకరించుకున్న, వాసుదేవునిగా పిలవబడే ఓ శ్రీకృష్ణా, చంద్రునివంటి ముఖము, తామరపువ్వుల వంటి అందమైన కన్నులు కలిగిన నీవు, గోపికలచే మరియు ఈ లోకమంతటిచేత ఆరాధించబడేవాడివి మరియు రాధకు ఇష్టమైన సఖుడవు.
చరణం-1: పాల సముద్రం మీద పవళించే, స్వర్గలోకంలో నివసించే, దీనభక్తుల దుఃఖాన్ని దూరం చేసే నీవు, ఈ ప్రపంచాన్నే రంగస్థలంగా చేసి మా నాటకీయమైన జీవితాన్ని నడిపించే నీవు, రాధకు ఇష్టమైన సఖుడవు.
చరణం-2: వెన్నముద్దలను మాయంచేసే ఓ శ్రీకృష్ణ, నీ భక్తులమైన మేము కోరిన కోరిన కోరికలను తీర్చే శ్రీరంగడవైన నీవు, రాధకు ఇష్టమైన సఖుడవు.
Click here for pdf వనమాలి వాసుదేవ (Vanamaali vasudeva lyrics in Telugu)
And click here for English
చిట్క:
పాటలతో పాటు భజనలు నేర్చుకోండి: మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు, లేదా ఇంట్లో పూజలు ఏమైనా చేసినప్పుడు పాటలు పాడితే మనం మాత్రమే పాడతాం, లేదా ఆ పాట తెలిసిన వాళ్ళు మనతో పాటు గొంతు కలుపుతారు.
అదే ఒక్కసారి భజనలు పాడి చూడండి, ఆ గదిలో ఉన్న ప్రతీఒక్కరూ మీతో పాటు గొంతు కలుపుతారు. ఆ భజన పూర్తయ్యాక వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అదే భజన యొక్క ప్రత్యేకత.
చిన్నపిల్లలకు కూడా భజనలు చాలా సులువుగా అర్థం అవుతాయి. అందుకే పాటలతో పాటు భజనలు కూడా నేర్చుకొని, పాడి తరించండి.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….
*గమనిక: నాకు తమిళం రాదు, ఈ పాట తమిళంలో ఉంది కనుక పాటలో ఎలాంటి తప్పులు గమనించిన వెంటనే తగిన ఆధారాలతో కామెంట్స్ విభాగంలో తెలియజేయగలరు. ధన్యవాదాలు.
← అచ్యుతం కేశవం తరువాత →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)
What’s app Number: +91 99662 00544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org