వరవీణ - గీతం
VaraveeNa geetam in telugu: “వరవీణ” శ్రీ అప్పయ్య దీక్షితార్ వ్రాసిన గీతాలలో ఒకటి. ఈ గీతంలో కవి, లక్ష్మీదేవి గురించి చాలా అందంగా వర్ణించారు. ఇది సంస్కృత భాషలో వ్రాయబడింది.
ఈ గీతం చతురస్ర జాతి రూపక తాళంలో ఉంది. ఇందులో ఒక ధృతం మరియు ఒక లఘువు ఉన్నాయి.
రచన: శ్రీ అప్పయ్య దీక్షితార్
రాగం: మోహన (28వ మేళకర్త యైన హరికాంభోజి జన్యం)
తాళం: రూపక తాళం (చతురస్ర జాతి) క్రియలు: 06




వరవీణ సాహిత్యం-అర్థం:
ఓ మాతా! నీ మృదువైన చేతులలో అత్యుత్తమమైన వీణను కలిగిఉన్నావు. తామర పువ్వు రేకుల వంటి కన్నులు కలిగిన ఓ రాణి,
తుమ్మెదల (తుమ్మెదలు గుండ్రంగా తిరిగేటప్పుడు ఎలా ఉంటుందో, లక్ష్మీదేవి కేశాలు అలా ఉన్నాయని కవి వర్ణన) గుంపును పోలిన ఉంగరాల వంటి అందమైన కురులు కలిగిన నీవు దేవతలచే పూజింపబడే పవిత్రమైన కళ్యాణి రూపానివి.
హే లక్ష్మి, సాటిరాని ఎన్నో మంచి గుణాలను కలిగిన నీవు ఎల్లప్పుడు జయాలు ప్రసాదించే మంచి స్వభావం కలిగినదానవు.
మాకు ఇష్టమైన వరాలను ఇచ్చి మమ్మల్ని సంతోషపెట్టే ఆ రంగనాథునికి పట్టపురాణివి మరియు నీ భక్తుల కోర్కెలను తీర్చేదానివి.
తామర పువ్వుని పీఠంగా చేసుకున్న ఓ బ్రహ్మదేవుని మాతృమూర్తి, మాకు జయములను ప్రసాదించే స్వభావం గల నీకు జయము జయము.
Click here for వరవీణ సాహిత్యం (VaraveeNa geetam in telugu)
Click here for English
చిట్క:
మీరు నేర్చుకునే ప్రతీదీ ఒక పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోండి. రాయడం వలన నేర్చుకునే దాని మీద మీ మనసు లఘ్నం చేయగలుగుతారు, అప్పుడు నేర్చుకునే గీతం/పాట ఏదైనా దాని సాహిత్యం బాగా అర్థం అవుతుంది. సాహిత్యం అర్థమైతే పాటలో లీనమై పాడగలుగుతారు.
పాటలను రాయడం వలన మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దాని వలన పుస్తకం అవసరం లేకుండానే పాడగలుగుతారు.
కమలజదల గీతంలో మళ్లీ కలుద్దాం. ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. నమస్కారం.
కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇 సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.