Vinayaka ninu vina brochutaku lyrics in Telugu with meaning

వినాయకా నిను వినా బ్రోచుటకు
(గణేష్ పాట)

Vinayaka ninnu vina brochutaku lyrics in Telugu: వినాయకా నిను వినా బ్రోచుటకు పాట 20వ శతాబ్దానికి చెందిన శ్రీ E. V రామకృష్ణ భాగవతార్ గారిచే హంసధ్వని రాగం, ఆది తాళంలో స్వరపరచబడింది.

కరుణా సాగరుడవైన నీవు తప్ప నన్ను కాపాడేవారు ఇంకెవరున్నారని, భక్తులను ఆదరించే నీవు నన్ను కూడా చేరదీయమని, కవి ఆ గణనాథుడిని ప్రార్థిస్తున్నాడు.  

Vinayaka ninnu vina brochutaku lyrics in Telugu
వినాయకా నిను వినా బ్రోచుటకు సాహిత్యం
వినాయకా నిను వినా బ్రోచుటకు సాహిత్యం అర్థం

వినాయకా నిను వినా బ్రోచుటకు సాహిత్యం అర్థం:

పల్లవి: విఘ్నాలకు అధిపతైన ఓ వినాయకా! నన్ను కాపాడడానికి నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా??

అనుపల్లవి: దిక్కులేని వాళ్ళను రక్షించే వాడవు నీవే కదా! నన్ను కూడా దగ్గరకు తీసుకొని కాపాడవచ్చుకదా.

చరణం: ఎర్రని తామర పువ్వు వంటి అందమైన ముఖము కలిగిన ఓ గణేశా, నీవు అన్ని యుగాలలోను మానవాళిని ముందుకు నడిపించే శక్తివి.

ఎల్లప్పుడు నిన్ను ఆశ్రయించే వారి కష్టాలను పోగొట్టేవాడివి.

సముద్రము వలె అధికమైన దయ గల ఓ వినాయక, నీవు నీ భక్తులకు వరాలను ప్రసాదించే సహజ లక్షణం కలవాడివి.

నాకు తండ్రి మరియు గురువైన గోపాల దాసునిచే స్తుతించబడి, నీ భక్తులను ఎప్పుడూ రక్షించే నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

Click here for pdf వినాయకా నిను వినా బ్రోచుటకు (Vinayaka ninnu vina brochutaku lyrics in Telugu)

Click here for English

చిట్క:

నేర్చుకునే పాట లేదా మరేదైనా సరైన పద్ధతిలో ఖచ్చితత్వంతో నేర్చుకోవడానికి, మీ పాట అభ్యాస వేగాన్ని తగ్గించండి. ఇది రెండు విధాలుగా సాధించవచ్చు.

మొదట పాటలోని ఒక విభాగం నుండి మరొక విభాగానికి త్వరగా వెళ్లకుండా ఉండడం.

రెండవది, పాటలోని చిన్న విభాగాన్ని తీసుకొని పదే పదే దాన్ని విని అందులోని సారాంశాన్ని గ్రహించడం.

ఇలా చేయడం వలన పాట మీద మీకు మంచి పట్టు ఉంటుంది మరియు చాలా రోజుల వరకు గుర్తుంటుంది.

మీకు ఈ పాట నచ్చిందని ఆశిస్తున్నాను, మీకు ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి దిగువ comments sectionలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో కలుద్దాం. నమస్కారం. 

మహా గణపతిం                                                                                                        శక్తి సహిత గణపతిం

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽 సంప్రదించండి..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు