క్షీరాబ్ధి కన్యకకు
Ksheerabdhi kanyakaku lyrics in Telugu with meaning: క్షీరాబ్ది కన్యకకు కీర్తన తిరుమల వేంకటేశ్వరునికి అత్యంత భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన చాలా ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు ఆ శ్రీనివాసుని సతీమణి అయిన శ్రీ మహాలక్ష్మికిని వర్ణిస్తూ వ్రాసారు.
‘నీరాజనం’ అంటే హారతి (వెలిగించిన కర్పూరం లేదా నూనెలో ముంచిన వత్తులతో పూజించడం).
క్షీరాబ్ధి కన్యకకు సాహిత్యం అర్థం:
పల్లవి: తామరపువ్వు మీద ఆసీనురాలై, పాల సముద్రం చిలికినప్పుడు ఉద్భవించిన స్త్రీయైన శ్రీ మహాలక్ష్మికి హారతి ఇస్తూ పూజిస్తున్నాము.
చరణం 1: తామర పువ్వు రేకుల వంటి అందమైన కన్నులు కలిగిన ముఖమునకు, చక్రవాకములవంటి స్తనములు కలిగిన లక్ష్మీదేవికి కర్పూరపు హారతి. తుమ్మెదల గుంపు వంటి శిరోజాల కొప్పుకు, కమలముల వంటి చేతులు కలిగి, నిలువునా మాణిక్యాలు పోసినట్టు మెరిసిపోతున్న రమాదేవికి హారతి.
చరణం 2: దేదీప్యమానంగా వెలిగే ప్రకాశవంతమైన వేంకటేశ్వర స్వామికి మహారాణివై ఎల్లప్పుడూ కళగా ఉండే పతివ్రత స్త్రీవైన నీకు హారతి. అలమేల్మంగ చక్కదనములన్నింటిలోకి శాశ్వతంగా శోభాయమానంగా వర్ధిల్లుతూ ఈ లోకంలో వ్యాపించి ఉన్న లక్ష్మీదేవికి హారతి.
Click here for pdf క్షీరాబ్ధి కన్యకకు సాహిత్యం (Ksheerabdhi kanyakaku lyrics in Telugu)
Click here for English
చిట్క:
మీకు మీరు బహుమతులు ఇచ్చుకోండి: ఏదైనా సాధించినప్పుడు అంటే కొత్త పాట, రాగం, గీతం, వర్ణం మొదలైన వాటిని మంచిగా నేర్చుకొన్నప్పుడు మీకు మీరు ఏదైనా బహుమతిని ఇచ్చుకోండి. ఇలా చేయడం వలన ఇంకా మంచిగా కొత్తవి నేర్చుకోవడానికి ఇది దోహదం చేస్తుంది.
భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని ప్రేరేపించడాన్ని సులభతరం చేస్తుంది.
ఉదా: ఒక కొత్త పాట నేర్చుకున్నారనుకోండి మంచి డిన్నర్ కోసం బయటకు వెళ్లడం లేదా మీకు ఉపయోగపడే వస్తువును కొనుక్కోండి.
ఆ వస్తువును చూసిన ప్రతీసారి మీరు నేర్చుకున్న పాట గుర్తొస్తుంది. ఇది మున్ముందు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి ప్రేరణను ఇస్తుంది.
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం🙏🏽….
← ముందు పిడికిట తలంబ్రాల →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org
ధన్యవాదాలు