Pidikita talambrala lyrics in Telugu with meaning

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
(అన్నమాచార్య కీర్తన)

Pidikita talambrala lyrics in Telugu with meaning: ఈ కీర్తన తిరుమల వేంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన బహు ప్రాచుర్యం పొందిన పెళ్లి పాట.

ఇందులో అన్నమాచార్యుల వారు వివాహ వేడుకలో ఒకటైన తలంబ్రాలు కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న వేంకటేశ్వరుని భార్య పద్మావతి దేవిని చక్కగా వర్ణించారు.

Pidikita talambrala lyrics in Telugu
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
Pidikita talambrala lyrics meaning in Telugu
పిడికిట తలంబ్రాల - సాహిత్యం అర్థం

పిడికిట తలంబ్రాల – సాహిత్యం అర్థం:

పల్లవి: వేంకటేశ్వరస్వామిని పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కూతురు పద్మావతి దేవి, పిడికిట్లో తలంబ్రాలను పట్టుకొని ఎదురుగా ఉన్న భర్తవైపు నేరుగా చూడలేక సిగ్గుపడుతూ కొంచెం వెనక్కి తిరిగి నవ్వుతుందని అన్నమాచార్యుల వారు కళ్లకుకట్టినట్టుగా వర్ణించారు.

చరణం-1: మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన యవ్వనవతైన మా పెండ్లి కూతురు, మెడ నిండా పెద్ద పేరుల ముత్యాల హారాన్ని వేసుకొని, ముతైదువుల మధ్య ఉన్న ఆమెను తన  ప్రభువు పేరును  అడుగుతుంటే సిగ్గుతో చెప్పలేక తలవంచుకుంది అని వర్ణిస్తున్నారు.

చరణం-2: అందంగా ఉన్న గజ్జెలను పెట్టుకున్న మా పెండ్లి కూతురు, తన భర్త కంటే కూడా మిక్కిలి గొప్ప పేరు గలిగినది. సిగ్గుతో ముతైదువుల వెనక దూరినప్పుడు, తన భర్తను ప్రేరేపించే విధంగా దొంగ చూపులు చూస్తూ ఉందని వర్ణిస్తున్నారు.

చరణం-3: తన పొడవైన జడలో పెద్ద పూల మాలను ధరించింది మా పెండ్లికూతురు, తన పెళ్లి రోజున అందమైన రక రకాల చీరలను కట్టింది. తన భర్త వేంకటేశ్వర స్వామి గట్టిగ కౌగిలించుకుంటే, ఆయన కౌగిట్లో నెమ్మదస్తురాలైన పద్మావతి దేవి చక్కగా ఒదిగిపోయిందని వర్ణిస్తున్నారు.

Click here for pdf పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు (Pidikita talambrala lyrics in Telugu)

And click here for English

చిట్క:

ఒక్కొక్కసారి మనం పాడుతున్నప్పుడు మధ్యలో కొన్నిసార్లు ఎంత పాడడానికి ప్రయత్నించినా ముందుకుపోదు, ఏదో తప్పుగా పాడుతున్నాం అని అనిపిస్తుంది కానీ పాడినకొద్దీ అదే తప్పు పలుకుతుంది.

అలాంటప్పుడు తొందర పడకుండా శాంతంగా సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోండి, కాసేపు దానిని విడిచిపెట్టి విశ్రాంతి తీసుకోండి లేదా వేరే పనిలో నిమగ్నమవ్వండి, తరువాత ప్రయత్నించండి తప్పకుండా వస్తుంది.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

క్షీరాబ్ధి కన్యకకు                                                                                                                                      Next

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు