Kondalalo nelakonna lyrics in Telugu with meaning

కొండలలో నెలకొన్న
(అన్నమాచార్య కీర్తన)

Kondalalo nelakonna lyrics in Telugu with meaning: ఈ కీర్తన తిరుమల వేంకటేశ్వర స్వామికి అమిత భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన బహు ప్రాచుర్యం పొందిన పాట.

ఇందులో అన్నమాచార్యుల వారు భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారమైన ఆ వేంకటేశ్వరుని గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన్ని ప్రార్థించి అతని ఆశీస్సులు పొందమని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

Kondalalo nelakonna lyrics in Telugu
కొండలలో నెలకొన్న - సాహిత్యం
Kondalalo nelakonna lyrics in Telugu with meaning
కొండలలో నెలకొన్న - సాహిత్యం అర్థం

కొండలలో నెలకొన్న- సాహిత్యం అర్థం:

పల్లవి: పర్వతాల మీద నివసించే, తిరుమలలోని పవిత్ర కోనేటికి (పుష్కరిణికి) ప్రభువైన శ్రీ వేంకటేశ్వర స్వామి, అపరిమితమైన మన కోరికలను అతి సులభంగా తీర్చేవాడు.

చరణం-1: కుండలను తయారుచేసే కురువరతనంబి అడిగిన వరాలన్నింటిని ఇచ్చినవాడు.

కుమ్మరివాడి మట్టిపూలను స్వీకరించి తన బంగారుపూలను పక్కన పెట్టడంతో ఆశ్చర్యపడి కొంచెం కోపగించిన తొండమాన్ చక్రవర్తి, గొడవపడాలని ఆ కుమ్మరి ఉన్న స్థలానికి వెళ్లి, ఆ కుమ్మరివాడికే శిష్యుడయ్యేటట్లు చేసినవాడు వేరెవరో కాదు, శ్రీ వేంకటేశ్వర స్వామే.

కథ:

(శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడైన కురువరతనంబి, కుండలను తయారుచేసి వాటిని అమ్మి జీవించేవారు. పని ఒత్తిడివల్ల స్వామి దర్శనానికి ప్రతిరోజూ వెళ్ళలేకపోయేవారు, స్వామిని ఎలాగైనా పూజించుకోవాలని స్వామి బొమ్మను తయారుచేసుకొని ఇంటిలోనే పెట్టుకొని పూజించేవారట.

ప్రతిరోజు కుండలు చేసిన తరువాత చేతికి అంటుకొని ఉండే మట్టితో పూలను చేసి వేంకటేశ్వర స్వామిని వాటితో పూజ చేసేవారట, అతని భక్తికి ముగ్ధుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆ పూలను స్వీకరించేవారట. ఆ మట్టిపూలు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పడేవట.

తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజూ బంగారుపూలతో స్వామిని అర్చించేవారు, కానీ ఆ పూలు పక్కకు తీయబడి మట్టిపూలు స్వామి పాదాల దగ్గర ఉండడం గమనించిన అర్చకులు చాలా ఆశ్చర్యపడేవారట. ఆ విషయం తొండమాన్ చక్రవర్తికి తెలియజేయగా ఆయన కుమ్మరి దాసు దగ్గరకు వచ్చి అతని శిష్యరికాన్ని పొందినాడట).

చరణం-2: పట్టుపట్టి, బలమైన కోరికతో పెద్ద చెరువును తవ్వడానికి సంకల్పించిన అనంతాళువారికి, ఏ ప్రతిఫలం ఆశించకుండా మట్టిని మోసి సహాయం చేసినవాడు.

ప్రేమ కలిగి తిరుమలనంబితో ప్రతిరోజూ పూజ చేయించుకున్నవాడు వేరెవరో కాదు, శ్రీ వేంకటేశ్వర స్వామే.

కథ-1:

(భగవద్రామానుజులవారి ఆజ్ఞతో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామికి పుష్పమాలా కైంకర్యం (భగవంతునికి చేసే సేవ) చేసిన భక్తుడు అనంతాళువారు.

తన పుష్పమాలా కైంకర్యం కోసం ఒక పుష్పోద్యానాన్ని పెంచదలచి దానికి నాందిగా ఒక పెద్ద చెరువును నిర్మింపదలచి ఇతరులెవ్వరి సహాయం లేకుండా తాను, తన భార్యతో మాత్రమే ఆ చెరువును తవ్వడానికి పూనుకున్నాడు. అప్పుడామె నిండు చూలాలు.

అతను గునపంతో మట్టిని తవ్వి గంపలతో ఇస్తుండగా అతని భార్య ఆ మట్టిని దూరంగా పోసేది. ఆ స్థితిని చూచి శ్రీ వేంకటేశ్వర స్వామి పన్నెండేండ్ల బాలుని రూపంలో వచ్చి మట్టిని దూరంగా పోయడంలో సహాయపడతారు.

ఈ విషయాన్ని భార్య ద్వారా తెలుసుకున్న అనంతాళువారు తన భార్యను నమ్మించి స్వామి కైంకర్యంలో పాలు పంచుకుంటున్న ఆ బాలునిపై కోపంతో తన చేతిలో ఉన్న గునపాన్ని బాలుని పైకి విసిరివేస్తాడు. అది ఆ బాలుని చుబుకానికి తాకి రక్తం కారుతుంది.

ఆ బాలుడు ఆనందనిలయంలోకి వెళ్లి కనబడకుండా దాక్కుంటాడు. అర్చకులు స్వామివారి చుబుకం నుంచి వస్తున్న రక్తస్రావాన్ని చూచి కలకలం చెంది అనంతాళువారికి విషయం చెబుతారు. అప్పుడు అనంతాళువారు జరిగిన విషయాన్ని గ్రహిస్తారు.

అర్చకులు ఆ గాయంపై పచ్చకర్పూరం అద్దుతారు. అందువలన నేటికీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి చుబుకంపై పచ్చకర్పూరం అద్దటం ఆచారం.

స్వామివారిని కొట్టడానికి అనంతాళువారు ఉపయోగించిన గునపం ఇప్పటికీ తిరుమలలోని స్వామివారి ఆలయ మహాద్వారం లోపల వేలాడదీసి ఉంది). 

కథ-2:

(శ్రీ వేంకటేశ్వర స్వామికి అభిషేక కైంకర్యం (భగవంతునికి చేసే సేవ) చేసిన భక్తుడు తిరుమలనంబి.

తిరుమల తిరుపతి మెట్లదారిలో ఒక చింతచెట్టు కింద తిరుమలనంబి రామానుజులవారికి ఒక సంవత్సరకాలం రామాయణాన్ని చెప్పినాడట. ఆ సమయంలో తిరుమలనంబికి స్వామి మధ్యాహ్న పూజ తప్పిపోతుందనే బాధ పీడించేదట.

అతని బాధను గమనించిన స్వామి తన పాదముద్రికలను ఆ ప్రదేశంలో అనుగ్రహించినాడట. వాళ్ళు ప్రతిరోజూ వాటికి పూజ చేస్తూ వచ్చినారు. తరువాత కొంతకాలానికి ఈ పాదాలు హరిజనుల పూజకు ప్రత్యేకించబడ్డాయట).

చరణం-3: కంచిలో నివసించే తిరుకచ్చినంబి అనే భక్తునిపై దయచూపి తన దగ్గరకు రప్పించుకున్నవాడు.

సకల ప్రశంసలకు మించిన వేంకటేశ్వర స్వామి మనల్ని మంచిగా దయతో రక్షించేవాడు.

కథ:

(కంచి నుండి తిరుమలకు వచ్చిన భక్తుడు తిరుకచ్చినంబి. ఇతడు కంచిలోని వరదరాజ స్వామి వారికి వింజామర కైంకర్యం (భగవంతునికి చేసే సేవ) చేసేవాడు. భగవంతునితో సాక్షాత్తుగా మాట్లాడగలిగిన మహానుభావుడు. రామానుజులవారికి భగవద్రాహస్యాలు చెప్పినవాడు. వరదరాజాష్టకం ఇతను రచించిందే. (కచ్చి = కంచి, నంబి = నమ్మినవాడు, భక్తుడు) వేంకటేశ్వర స్వామి ఇతనిని రెండు పర్యాయములు తిరుమలకు రప్పించుకున్నాడట).

Click here for pdf కొండలలో నెలకొన్న (kondalalo nelakonna lyrics in Telugu)

And click here for English

చిట్క:

చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్లయినా సరే, వారికి ఉండే రోజువారి పని ఒత్తిళ్ల వలన సాధన చెయ్యడానికి కొన్నిసార్లు సమయం దొరకదు.

అలాంటప్పుడు మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఒక్క పది నిమిషాలు క్లాసులో నేర్చుకున్న దానిని సాధన చేసి నిద్రపొండి.

ఇలా రోజూ చెయ్యడం వలన అది అలవాటుగా మారుతుంది. ముందుముందు సాధన చేసే సమయం కూడా పెరుగుతుంది.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

జో అచ్యుతానంద                                                                                                ఇందరికీ అభయంబు

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు