Achyutam keshavam lyrics in Telugu with meaning

Achyutam keshavam lyrics in Telugu with meaning: అచ్యుతం కేశవం చాలా ప్రజాదరణ పొందిన భజన, ఇక్కడ కవి కృష్ణ భగవానుడిని వివిధ పేర్లతో స్తుతిస్తున్నాడు.

మీరు భక్తితో మనస్పూర్తిగా పిలిచినప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు, మీ చేతితో గోరుముద్దలు తింటాడు, మీతో కలిసి నృత్యం చేస్తాడు మరియు మీరు పాడే లాలి పాటను వింటూ హాయిగా నిద్రపోతాడు కూడా అని చెప్పాడు.

Achyutam keshavam saahityam
అచ్యుతం కేశవం - సాహిత్యం
Achyutam keshavam saahityam meaning
అచ్యుతం కేశవం - సాహిత్యం అర్థం

అచ్యుతం కేశవం సాహిత్యం అర్థం:

ఎలాంటి కళంకం లేని, అందమైన జుట్టుతో అందరినీ మంత్రముగ్ధులను చేసి, కేశి అనే రాక్షసుడిని సంహరించి, తన దివ్య గుణాలు మరియు అందంతో ఇతరులను ఆకర్షించి, యశోద మాత చేత తాడుతో నడుము చుట్టూ కట్టివేయబడినవాడైన, దేవి జానకి ప్రభువైన, ఆ నారాయణుడి అవతారమైన స్వామిని మేము సదా పూజిస్తాము. 

భగవంతుడు నీ దగ్గరకు రాడని ఎవరు చెప్పారు? నీవు ఆయన్ని మీరాబాయి పిలిచినట్లుగా పిలవడం లేదు. 

(మీరాబాయి 16వ శతాబ్దానికి చెందిన హిందూ ఆధ్యాత్మిక కవయిత్రి మరియు కృష్ణుని అపారమైన భక్తురాలు).

భగవంతుడు తినడు అని ఎవరు చెప్పారు? నీవు శబరి లాగా రేగి పండ్లను తినిపించడం లేదు.

(శబరి అడవిలో పండ్లను సేకరించి కొరికి తియ్యగా ఉన్న పండ్లను మాత్రమే శ్రీరామునికి సమర్పించే భక్తురాలు).

భగవంతుడు నాట్యం చేయడని ఎవరు చెప్పారు? మీరు అతనితో గోపికలు చేయించినట్లుగా నాట్యం చేయించడం లేదు!

(గోపికలు కృష్ణుడితో ఆడతారు, నృత్యం చేస్తారు, అతని సాన్నిహిత్యంలో పరవసిస్తారు. ఎక్కువగా కృష్ణుడు తన 1600 మంది గోపికలతో బృందావనంలో తిరుగుతూ ఉంటాడు).

భగవంతుడు నిద్రపోడు అని ఎవరు చెప్పారు? తల్లి యశోద నిద్రపుచ్చినట్లుగా నీవు అతనిని నిద్రపుచ్చడం లేదు!

(యశోద కృష్ణుని పెంపుడు తల్లి మరియు నందుని భార్య, ఆమె ఎప్పుడూ గోకులం అంతటా సంచరించే కృష్ణుడిని కంటికి రెప్పలా కాపాడుకునేది).

గోవింద (ఆవులు, భూమి మరియు మొత్తం ప్రకృతిని సంతోషపెట్టేవాడు), హరి (ఆధ్యాత్మిక పురోగతికి అన్ని అడ్డంకులను తొలగించేవాడు), గోపాల్ (గోవుల రక్షకుడు) మరియు రాధా రమణుడైన (రాధ ప్రేమికుడైన) శ్రీ కృష్ణునికి నమస్కారం.

Click here for pdf అచ్యుతం కేశవం – సాహిత్యం (Achyutam keshavam lyrics in Telugu)

And click here for English

చిట్క:

ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ కావొద్దు: మనం ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించే అనేక అంశాలు మన చుట్టూ ఉంటాయి.

మీరు సంగీతాన్ని అభ్యసిస్తున్నప్పుడు టెలివిజన్‌ని ఆఫ్ చేయండి, మీ మొబైల్‌ను సైలెంట్ మోడ్‌లో ఉంచండి, మీరు సాధన చేస్తున్న గది తలుపులు మూసివేసి, ప్రశాంతమైన మనస్సుతో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించండి.

మీరు నేర్చుకోబోయేది ఎక్కువగా ఉంటే భయపడకండి, బదులుగా వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించి సాధన మొదలుపెట్టండి. కొన్ని నేర్చుకున్నాక మిగిలినవి కూడా నేర్చుకోవడానికి ప్రేరణ కలుగుతుంది. మీకు తెలియకుండానే మీరు నేర్చుకోవలసిన మొత్తం భాగాన్ని పూర్తి చేస్తారు.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….

భో శంభో శివ శంభో స్వయంభో                                                                           వనమాలి వాసుదేవ

కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏽  సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు