Jo achyutananda lyrics in Telugu with meaning

జో అచ్యుతానంద
(అన్నమాచార్య కీర్తన)

Jo achyutananda lyrics in Telugu with meaning: ఈ కీర్తన తిరుమల వేంకటేశ్వరునికి అత్యంత భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన బహు ప్రాచుర్యం పొందిన లాలి పాట.

ఇక్కడ అన్నమాచార్యుల వారు శ్రీ కృష్ణ భగవానుడిని గొప్పతనాన్ని ఆయన వివిధ రకాల అల్లరి చేష్టలను పొగుడుచూ, ఆటపాటలతో అలసిన నీవు కాస్త నిదురపోవయ్య అని పిలుస్తున్నారు.

ఇలాంటి జోల పాటల గొప్పదనం ఒక్క అన్నమాచార్యుల వారికే దక్కునేమో అన్నంత చక్కగా రచించారు.

Jo achyutananda lyrics
జో అచ్యుతానంద
Jo achyutananda lyrics in Telugu with meaning
జో అచ్యుతానంద - సాహిత్యం అర్థం

జో అచ్యుతానంద – సాహిత్యం అర్థం:

పల్లవి: ఓ శ్రీరామ, గోవులను పాలించేవాడా, ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడా, మోక్షాన్ని ప్రసాదించేవాడా, పరమాత్మ, ఇక ఆటలు చాలించి ఇలా వచ్చి నిదురపోవయ్య.

చరణం-1: నందుని ఇంట్లో ఉండి, నీ గౌరవాన్ని, దైవత్వాన్ని పక్కన పెట్టి ఆవులను కాచావు. చంద్రుని వంటి అందమైన ముఖము కలిగిన గోపికలు నీకు ఉపచారాలు చేయగా, ఆవులను కాపు కాయమంటే అది వదిలేసి, చక్కగా ఆ గోపికల ఇళ్లల్లో ఆటలు ఆడుతున్న ముద్దులొలికే మా నల్లనయ్య నిదురపోవయ్య.

చరణం-2: పాల సముద్రం మీద నిదురించినావు, బాలునిగా ఉన్నప్పుడే మునులను రక్షించావు, లోక కళ్యాణం కోసం వసుదేవునకు పుట్టావు, బాలునివైనా గాని గోవులను అన్నింటిని పాలించే గోపాలకృష్ణుడవయ్యావు, ఇక ఆటలు చాలించి నిదురపోవయ్య. 

చరణం-3: చాలా అందంగా, రసభరితంగా, తాళ్ళాపాక అన్నమాచార్య రచించి పాడిన ఈ జోల పాట, అన్ని భోగ భాగ్యాలను ఏలుతున్న నీకు శుభము ఓ తిరుపట్లలో నెలకొన్న మదనగోపాల, ఇక ఆటలు చాలించి నిదురపోవయ్య.

Click here for pdf జో అచ్యుతానంద (Jo achyutananda lyrics in Telugu)

And click here for English

చిట్క:

లాలి పాటలను నేర్చుకోండి: లాలి పాటలను దేవుని పవళింపు సేవలో పాడతారు. ముఖ్యంగా వైభోగ ప్రియుడైన వేంకటేశ్వర స్వామికి పవళింపు సేవ ఇంచుమించు అన్ని దేవాలయాలలోను జరుగుతుంది.

ఆ స్వామిని కీర్తిస్తూ చివరగా జోల పాటతో నిద్రపుచ్చే ఆ సేవ మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది. మాకు దగ్గరలో ఉన్న దేవాలయంలో నేను కూడా విధిగా వెళ్లి ఆ స్వామిని కీర్తిస్తూ ఉంటాను. అది నాకు దొరికిన అదృష్టం.

ఈ లాలి పాటలు దేవాలయాల్లోనే కాక పిల్లలకు బారసాల జరిగినప్పుడు ఉయ్యాలలో వేస్తారు కదా అప్పుడు పాడతారు. పిల్లలు, పెద్దలు కూడా నిద్రపోయే ముందు ఇలాంటి పాటలు పాడించుకుంటారు.

ఇలాంటి పాటలు నిద్రపోయే ముందు వినడం వలన కంటి నిండా ప్రశాంతమైన నిద్ర పడుతుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది.

విచిత్రమైన సంఘటన ఏంటంటే ఒక రోజు నేను పని ముగించుకొని పడక గదికి వెళ్ళేటప్పటికి మా ఆయన జో అచ్యుతానంద పాట పాడుకుంటూ తనకు తానే జోకొట్టుకుంటున్నారు. నాకు చాలా ముచ్చటేసింది. మనకు మనమే లాలి పాటలు పాడుకోవచ్చని అప్పుడే నాకు తెలిసింది.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం….

వేడుకుందామా                                                                                                       కొండలలో నెలకొన్న

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు