హె శారదె మా
(సరస్వతి దేవి పాట)
Hey sharde maa lyrics in Telugu with meaning: పాఠశాలల్లో పిల్లలు ప్రార్థన గీతంగా పాడుకోవడానికి బాగుండే ఒక మంచి పాట ఈ శారద దేవి పాట.
ఇందులో పిల్లలు తమకు కావలసిన విద్యను, సంగీతాన్ని ఇవ్వమని కోరుతూనే తమలో ఉన్న అంధకారాన్ని కూడా పారద్రోలమని ఆ శారద దేవిని ప్రార్థిస్తున్నారు.
దేవి నవరాత్రులలో సరస్వతీ దేవి అలంకారం చేసినప్పుడు కూడా ఈ పాటను పాడతారు.
హె శారదె మా – సాహిత్యం అర్థం:
పల్లవి: ఓ శారదా దేవి, అఙ్ఞానంలో నుంచి బయటకు వచ్చేందుకు మాకు వెలుగును ప్రసాదించమ్మ.
చరణం-1: నీవు స్వరాల రాణివి, సంగీతం నీనుంచే పుట్టింది. ప్రతీ శబ్దం నీవు పలికించేదే మరియు ప్రతీ పాట నీవు పాడించేదే.
మేము ఒంటరిగా దిక్కుతోచక ఉన్నాము, నీ ఆశ్రయాన్ని మాకు కల్పించి మాకు ప్రేమ పంచు తల్లీ.
చరణం-2: వేదాలలోని భాషను, పురాణాలలోని పదాలను, ఋషులు అర్థం చేసుకున్నారు, సద్గురువులు తెలుసుకున్నారు.
మేము కూడా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. అందుకోసం తగిన జ్ఞానాన్ని పొందే హక్కును మాకు కూడా ప్రసాదించు తల్లీ.
చరణం-3: నీవు తెలుపు రంగులో అందంగా మెరిసిపోతున్నావు. చేతుల్లో వీణ, తలపై కిరీటం అలంకరించుకొని కమలంపై కూర్చున్న నీవు మహారాణిలా వెలిగిపోతున్నావు.
మా మనసుల్లోని చీకటిని తుడిచివేసి, మాకు వెలుగుల ప్రపంచాన్ని ప్రసాదించు తల్లీ.
Click here for pdf హె శారదె మా (hey sharde maa lyrics in Telugu)
And click here for English
చిట్క:
పాటలు నేర్చుకునేటప్పుడు చాలా మంది పేపర్ల మీద రాసుకోవడం లేదా print తీసుకోవడం చేస్తుంటారు. అలా చేయడం వలన కాలక్రమేణ మీరు నేర్చుకున్న పాటలను మిస్ అవ్వడంతో పాటు అసలు ఏమి నేర్చుకున్నారో కూడా మరిచిపోయే అవకాశం ఉంటుంది.
చక్కగా ఒక పుస్తకం పెట్టుకొని అందులో రాసుకోండి, లేదా ఒక e-book లా మీ కంప్యూటర్లో పొందుపరుచుకోండి.
మీ వీలును బట్టి కచ్ఛితంగా వారానికి ఒక్కటో లేదా రెండు వారాలకి ఒక్కటో పాటను నేర్చుకోవాలి అని నిర్థారించుకొని అనుసరించండి, సంవత్సరం తిరిగేలోగా ఒక చిన్న పాటల సంపుటి మీ దగ్గర సిద్దమై ఉంటుంది.
ఇంకా ఇలాంటివి కావాలనుకుంటే ఏమి చెయ్యాలో నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదనుకుంటాను?? మీ పాటలను నాతో కూడా పంచుకుంటారని ఆశిస్తూ……
ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….
← శుభములనిచ్చు శ్రీ శారద దేవి అంబే అంబికే జగదంబికే →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org
ధన్యవాదాలు