అలంకారాలు
Alankaralu in telugu: సంగీత ప్రపంచమునకంతయు సప్తస్వరములెట్లు పునాదియో అట్లే తాళ లోకమునకు సప్త తాళములు పునాది. అవి ధృవతాళము, మఠ్య తాళము, రూపక తాళము, ఝంపె తాళము, త్రిపుట తాళము, అట తాళము, ఏక తాళము. ఈ తాళముల గూర్చి ఈ క్రింది శ్లోకములో చూడవచ్చు.
“ధృవమఠ్యారూపకశ్చ ఝంపాత్రిపుట యేవచ
అటతాళే కతాళేచ సప్త తాళ ప్రకీర్తితః”
ఈ సప్త తాళములు వారము యొక్క సప్త దినములలో పుట్టినట్లును, సప్త నక్షత్రములలో సప్త రంగులు కలవి యైనట్లును పూర్వీకులు వ్రాసిన శ్లోకముల వల్ల తెలియుచున్నవి. వీటి వివరణములు విస్తారముగా తెలుసుకుందాం.
లఘువు:
లఘువును ఒక నిలువు గీత (I) సంకేతముతో చూపబడును. తాళము వేయునపుడు లఘువు, చేతితో ఒక దెబ్బ వేసి వ్రేళ్ళను ఎంచుటతో చూపబడును.
అనుధృతము:
అనుధృతమును అర్థ చంద్రాకృతి (ں) సంకేతముతో చూపబడును. తాళము వేయునపుడు అనుధృతము, చేతితో ఒక్క దెబ్బతో చూపబడును.
ధృతము:
ధృతము పూర్ణ సున్న (౦) సంకేతముతో చూపబడును. తాళము వేయునపుడు ధృతము, చేతితో ఒక దెబ్బయు, ఒక విసరుతో చూపబడును.
ఏడు తాళాలు ఈ క్రింది pdf లో చూడగలరు…
Click here for Pdf అలంకారాలు
Click here for English
చిట్క:
మీరు సంగీతం నేర్చుకొనేటప్పుడు మీ ఇంట్లో దానికి తగ్గ పరిసరాలను కూడా ఏర్పరుచుకోవాలి. అంటే…
- మీకు నచ్చిన పాటలను వినడం, పాడడం.
- మీరు నేర్చుకున్న దాని గురించి గూగుల్ లో వెతికి ఇంకా దానికి సంబంధించిన ఏవైనా కొత్త విషయాలు ఉంటే తెలుసుకోవడం.
- ప్రతీరోజు సాధన చేయడానికి కొంత సమయాన్ని వెచ్చించడం.
- మీరు నేర్చుకున్న దాని అర్థం తెలుసుకోవడం మొదలైనవి.
ఇలాంటివన్నీ చేయడం వలన సంగీతం మీద మీరు మరింత అవగాహన పెంచుకోగలుగుతారు.
హెచ్చు స్థాయి స్వరాల్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
← జంట స్వరాలు హెచ్చుస్థాయి స్వరాలు →
కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి..
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
What’s app Number: +91 99662 00544.
నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.