Indariki abhayambu lyrics in Telugu with meaning

ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
(అన్నమాచార్య కీర్తన)

Indariki abhayambu lyrics in Telugu with meaning: ఈ కీర్తన తిరుమల వేంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్య స్వరపరిచిన బహు ప్రాచుర్యం పొందిన కీర్తన.

ఇందులో అన్నమాచార్యుల వారు, వివిధ అవతారాలలో విష్ణుమూర్తి లోక కళ్యాణార్థమై ఏ విధంగా మానవాళి మనుగడకి సహాయమందించారో వర్ణించారు.

Indariki abhayambu lyrics in Telugu with meaning
ఇందరికీ అభయంబు - సాహిత్యం
Indariki abhayambu lyrics meaning in Telugu
ఇందరికీ అభయంబు - సాహిత్యం అర్థం

ఇందరికీ అభయంబు – సాహిత్యం అర్థం:

పల్లవి: అందరినీ రక్షించే, మనకు సరైన మార్గాన్ని చూపే బంగారమంటి మంచి చేయి శ్రీ వేంకటేశ్వర స్వామి చేయి.

చరణం-1: వెలకట్టలేని విలువైన వేదాలను సముద్రం నుండి వెతికి తెచ్చింది ఈ చేయి (మత్స్యావతారంలో), సముద్ర మథనం సమయంలో మందర పర్వతం నిలబడడానికి దాని క్రింద ఉండి సహాయం చేసినది ఈ చేయి (కూర్మావతారంలో),

అందమైన భూదేవిని దగ్గరకు తీసుకున్నది ఈ చేయి (వరాహావతారంలో), రాక్షసులను చంపగల నైపుణ్యం గలిగిన పదునైన వేలిగోర్లు కలిగిన చేయి (నరసింహావతారంలో).

చరణం-2: రెండు అడుగులతో భూమిని, ఆకాశాన్ని ఆక్రమించిన కూడా తృప్తి చెందక బలి చక్రవర్తిని మూడవ అడుగు స్థలాన్ని ఇవ్వమని అడిగింది ఈ చేయి (వామనావతారంలో), ఉదారంగా భూమిని మొత్తం బహుమతిగా ఇచ్చినది ఈ చేయి (పరశురామ అవతారంలో), 

భూగర్భంలో ఉన్న నీటిని బాణం సంధించి బయటకు తీసుకువచ్చినది ఈ చేయి (రామావతారంలో), భుజమునందు నాగలిని పట్టుకున్నది ఈ చేయి (బలరామావతారంలో).

చరణం-3: బృందావనములో నివసించే గోపికలు, తాను చేసే చిలిపి చేష్టలకు కోపం తెచ్చుకుంటే అదేమీ లెక్కచేయకుండా వారితో ఆటపాటలతో మునిగినది ఈ చేయి (కృష్ణావతారంలో), గుర్రాన్ని స్వారీ చేసే గొప్ప చేయి (కల్కి అవతారంలో),

తన ఆశ్రయం పొందిన జీవులన్నింటికి మోక్షాన్ని ప్రసాదించే చేయి, వేరెవరిదో కాదు సాక్షాత్తు వేంకటాధ్రికి ప్రభువైన శ్రీ వేంకటేశ్వర స్వామిదే.

Click here for pdf ఇందరికీ అభయంబు (Indariki abhayambu lyrics in Telugu)

And click here for English

చిట్క:

చాలా మంది youtube, ఆడియో మరియు వీడియోలు విని చూసి సంగీతం నేర్చుకోవచ్చని అనుకుంటుంటారు.

మీ స్వంతంగా సంగీతాన్ని నేర్చుకోవడం అనేది చాలా అరుదు ఎందుకంటే, సంగీతం అనేది విస్తారమైన జ్ఞాన సముద్రం, ఇక్కడ మీకు సరైన మార్గంలో మార్గనిర్దేశం చేయగల ఉపాధ్యాయుడు ఉండటం చాలా అవసరం.

లేకపోతే, ‘ఏం చేయాలో’ మీకు ఎలా తెలుస్తుంది? మరి మీరు తప్పు చేస్తే ‘ఎవరు’ చెబుతారు? కనుక ఒక మంచి గురువుని చూసి మీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించండి.

ఈ పాట మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, ఏవైనా సందేహాలు ఉంటే దిగువ ఉన్న comment విభాగంలో మీ సందేశాన్ని పంపండి. తదుపరి పాటలో మళ్ళీ కలుద్దాం, నమస్కారం….

కొండలలో నెలకొన్న                                                                                            చూడరమ్మ సతులాల 

కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..

క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్)

అంజలి సుధీర్ బండారి

What’s app Number: +91 9966200544.

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.

మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్‌ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org

ధన్యవాదాలు