Rara veNugopabala – Swarajati

రార వేణుగోపాబాల - స్వరజతి

Rara veNugopabala – swarajati: రార వేణు అనేది బిలహరి రాగంలో స్వరపరచబడిన ప్రసిద్ధ స్వరజతి. ఇది సరళంగా సంస్కృతంలో వ్రాయబడింది. ఈ స్వరజతిలో కవి, ఒక అమ్మాయి తనను చేరుకోమని పదే పదే శ్రీ కృష్ణుడిని వేడుకుంటున్న దృశ్యాన్ని వివరిస్తున్నారు.

ఈ స్వరజతి ఆది తాళంలో ఉంది. ఇది ఒక లఘువు మరియు రెండు ధృతాలను కలిగి ఉంటుంది.  

రాగం: బిలహరి (29వ మేళకర్త ” ధీరశంకరాభరణ” జన్యం).

తాళం: ఆది తాళం                    క్రియలు: 8

Bilahari Ragam-Rara veNu
బిలహరి రాగం ఆరోహణ & అవరోహణ
Rara veNugopabala swarajati 1
Rara veNugopabala swarajati 2
రార వేణు స్వరజతి స్వరం & సాహిత్యం
రార వేణు స్వరజతి సాహిత్యం
రార వేణుగోపాబాల స్వరజతి సాహిత్యం-అర్థం:

పల్లవి:

[ఓ యాదవుడైన నందుని కుమార, వేణువు చేత పట్టుకున్న శ్రీ కృష్ణ, అందంగా, ఆరాద్యపూర్వకంగా, విజయాలను పొందే గొప్ప గుణాలను కలిగిన నీవు నా వద్దకు రావయ్య].

అనుపల్లవి:

[ఓ తామరపువ్వు వంటి కన్నులు కలిగిన శ్రీ కృష్ణ, నేను ఏ నేరం చేసాను? ఈ విరహ బాధను నేను భరించలేను].

చరణం 1:

[ఓ నంద కుమారా! నేను మరెక్కడికీ వెళ్ళలేను. నీవు ఇక్కడికి రా స్వచ్ఛమైన మనస్సుతో మరియు నవ్వులు వికసించే మొముతో నా ఎదురుగ వచ్చి నన్ను అనుగ్రహించు].

చరణం 2:

[నేను నిన్ను ఆప్యాయంగా పదే పదే పిలుస్తున్నాను, నీవు ఎల్లప్పుడూ నీ భక్తుల ప్రార్థనలకు స్పందిస్తావు కదా, మరి నాకు ఎందుకు స్పందించవు? నేను ఇలా అన్నానని నా మీద కోపం తెచ్చుకొని అలగవద్దు, గజేంద్రుని పిలుపును విని తన బాధ నుండి విముక్తి ప్రసాదించావు అదేవిధంగా పదే పదే నేను పిలిచే పిలుపులను కూడా విని దయతో త్వరగా వచ్చి నన్ను చేరుకో].

చరణం 3:

[రా ఓ గోవర్ధన గిరిధారి, రా ఓ ముర అనే రాక్షసుడిని నాశనం (హర) చేసినవాడా, రా, ప్రపంచంలోని దుఃఖాలను తొలగించేవాడా, నేను ఎంత పిలిచిన ఎందుకు రావడం లేదు.

ఈ కన్యను, ఈ ఆడపిల్లను, ఈ అందగత్తెను ఆదరించు.

కోరికలు తృప్తి చెందాయి, నా హృదయం మరియు మనస్సు నీ దగ్గరే ఉన్నాయి నీ చెంతకు చేరుకున్నాయి. నన్ను మరువకు నా చేతులు జోడించి పదే పదే నిన్ను వేడుకుంటున్నాను].

Click here for pdf రార వేణు స్వరజతి

Click here for English

చిట్క:

మీరు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నారు మరియు ఎంత సమయం ప్రాక్టీస్ చేయగలుగుతారు అనేది ముందుగానే సెట్ చేసుకోండి. లక్ష్యం పెట్టుకోవడం వలన ఏకాగ్రతతో సాధన చెయ్యడం అలవడుతుంది మరియు ఎంత వరకు నేర్చుకోగలుగుతున్నారనేది సులభంగా తెలుసుకోగలుగుతారు.

మీ లక్ష్యాలను నిర్దేశించుకొనేముందు అసలు మీరు సంగీతాన్ని ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారో ఆలోచించండి:

  • ఇంట్లో సరదాగా పాడుకోవడానికా?
  • కుటుంబ శుభకార్యాలలో పాల్గొనడానికా? లేక
  • మీరు సంగీతాన్ని వృత్తిగా తీసుకోవాలనుకుంటున్నారా? మొదలైనవి.

దాని ప్రకారం మీరు ఏవిధంగా సాధన చెయ్యాలి అనేది తెలుసుకొని తదనుగుణంగా మీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు.

సాంబ శివయనవే స్వరజతిలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.

ఆనలేకర                                                                     సాంబ శివయనవే

కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏻  సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు