శ్రీ గణనాధ - గీతం
Sri GaNanatha Geetam in telugu: సరళీ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, హెచ్చుస్థాయి స్వరాలు నేర్చుకున్నాక గీతాలు నేర్చుకుంటాం. గీతాలలో మొదటిది “శ్రీ గణనాధ”. ఇది శ్రీ పురందర దాసు వ్రాసిన గీతాలలో ఒకటి. దీనిని శ్రీ పురందర దాసు, వినాయకుడిని పొగుడుతూ వ్రాసారు. ఇది సంసృతంలో వ్రాయబడింది.
ఈ గీతం చతురస్ర జాతి రూపక తాళంలో ఉంది. ఇందులో ఒక ధృతం మరియు ఒక లఘువు ఉన్నాయి.
రచన: శ్రీ పురందర దాసు
రాగం: మలహరి (15వ మేళకర్త యైన మాయామాళవగౌళ జన్యం)
తాళం: రూపక తాళం (చతురస్ర జాతి) క్రియలు: 06
సాహిత్యం-అర్థం:
పల్లవి:
[పరమేశ్వరుని అనుచరులైన గణాలకు అధిపతియైన ఓ విఘ్నేశ్వరా! ఎరుపు రంగు శరీరం కలవాడా, సముద్రమంత దయ కలవాడా, ఏనుగు ముఖం, పెద్ద పొట్టను కలిగినవాడా, లక్ష్మీ దేవి ని చేతి యందు కలిగిన ఓ పార్వతీ దేవి కుమారా, దేవతలచే పూజింపబడిన నీవే మాకు శరణు].
చరణం 1:
[ఓ విఘ్నేశ్వరా! మునులు, ఋషులు నీ పాదాల వద్దనే ఉంటారు, పరమేశ్వరుని అనుచరులైన గణాల చే పూజింపబడుతున్నావు. నీ భక్తుల కోరికలను నెరవేర్చే ఓ వినాయక నమో నమః].
చరణం 2:
[ఓ విఘ్నేశ్వరా! ఎలాంటి ఙ్ఞానాన్ని సంపాదించాలన్న మొదటిగా నిన్నే పూజిస్తాము, అందరికంటే ఉత్తముడివైన నీకు మా వందనాలు].
Click here for pdf శ్రీ గణనాధ గీతం
Click here for English
చిట్క:
మంచి గురువుని ఎంచుకోండి. ఒక సరైన పద్ధతిలో ఏది నేర్చుకోవాలన్న మంచి గురువు ఉండడం చాలా అవసరం. ఒక మంచి గురువు దగ్గర సంగీతం నేర్చుకోవడం వలన మీరు చేసే తప్పులను ఆ గురువు సరిచేసి మీ సంగీత ప్రయాణం సాఫీగా జరగడానికి తోడ్పడతారు. మీ గురువుని ఎల్లప్పుడూ గౌరవించండి. మీరు ఆ గురువు దగ్గర నేర్చుకోవడం మానేసినా కూడా గౌరవప్రదంగానే మెలగాలి. నేను మీకు ముందుగా చెప్పినట్లు మా గురువు పేరు శ్రీమతి. విజయలక్ష్మి, ఆవిడ మాకు గురువుగా దొరకడం మా అదృష్టం.
వాయిద్యాలు (Instruments) నేర్చుకోవాలనుకునే విద్యార్థులు గాత్రం మరియు వాయిద్యం తెలిసిన గురువు దగ్గర నేర్చుకోవడం ఉత్తమం. అలాంటి అవకాశం లేనప్పుడు ఇద్దరు గురువుల దగ్గరైన నేర్చుకోండి.
కుంద గౌర గీతంలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.
← హెచ్చుస్థాయి స్వరాలు కుంద గౌర →
కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే సంప్రదించండి👇🏽..
క్షేత్ర కర్ణాటక శాస్త్రీయ సంగీతం మరియు కూచిపూడి నృత్య తరగతులు (ఆన్లైన్/ఆఫ్‌లైన్)
అంజలి సుధీర్ బండారి
What’s app Number: +91 9966200544.
ఇమెయిల్: sudheer.anjali@gmail.com
నేను వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను.
మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.
పిల్లల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్‌తో మేము టై-అప్ అయ్యామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము.
మరిన్ని వివరాల కోసం మరియు డొనేట్ చేయడానికి క్లిక్ చేయండి: vidyaswecha.org
ధన్యవాదాలు