Sarali Swaralu in Telugu

సరళీ స్వరాలు

SaraLi Swaralu పేజీకి నేరుగా వెళ్లడానికి ఇక్కడ క్లిక్ చేయండి లేదా సరళీ స్వరాల గురించి తెలుసుకోవడానికి దిగువ చదవడం కొనసాగించండి.

అందరికి నమస్కారం,

నేను మీ అంజలి సుధీర్..

అందరు క్షేమంగా ఉన్నారని మరియు కరోనా టీకా వేయించుకున్నారని అనుకుంటున్నాను, ఇంకా వేయించుకోకపోతే దయచేసి వేయించుకోండి.

ఈరోజు నేను సంగీతం గురించి చెప్పి, కర్ణాటక సంగీతం నేర్చుకోవాలనుకునే వారికోసం నోట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను.

కర్ణాటక రాష్ట్రంలో పుట్టింది కాబట్టి దీనిని కర్ణాటక సంగీతం అంటారని చాల మంది అనుకుంటుంటారు, కానీ అది తప్పు. కర్ణం అంటే చెవి, చెవికి ఇంపుగా ఉంటుంది కనుక ఈ సంగీతానికి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చింది. సంగీతం గురించి ఇంకా తెలుసుకొనే ముందు ఈ సంగీత సాగరంలోకి నా మొదటి అడుగు ఎలా పడిందో చెప్పాలనుకుంటున్నాను.

నేను నా సంగీత ప్రయాణాన్ని అనుకోకుండా మొదలుపెట్టాను,

కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోజు నేను నా డాన్స్ క్లాస్ లో ఉండగా అక్కడే డాన్స్ నేర్చుకుంటున్న నా స్నేహితురాలి ద్వారా మా డాన్స్ క్లాసు కి దగ్గరలోనే సంగీతం నేర్పిస్తున్నారని తెలిసింది, స్వతహాగానే సంగీతం అంటే ఇష్టపడే నేను నా రోజువారీ ఉద్యోగం, డాన్స్ క్లాసు (వారానికి రెండు రోజులు) లతో బిజీ గా ఉన్నప్పటికీ సంగీతం క్లాసులో చేరాను.

మా సంగీతం టీచర్ పేరు శ్రీమతి. విజయలక్ష్మి, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. మమ్మల్నందరిని తన సొంత పిల్లల్లాగానే చూసుకునేవారు. నేను అక్కడ పిల్లలందరితో సరదాగా గడుపుతూ సంగీతం నేర్చుకున్నాను. నేను డాన్స్, సంగీతం రెండూ కూడా సరదాగా ఆస్వాదిస్తూ నేర్చుకున్నాను.

సంగీతం అనేది ఒక గొప్ప అనుభూతి, దానిని మాటల్లో చెప్పడం చాల కష్టం. ఎవరైనా వాళ్ళ పని చేసుకుంటూ పాడుతూ ఉంటే, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావ్ సంగతేంటి?? అని అడుగుతాం, అంటే సంగీతం అంటేనే సంతోషం, డాన్స్ అయినా అంతే..

నాకు సంబంధించినంత వరకు సంగీతం, డాన్స్ ఒకేలా కనిపించే కవలలు, దేనికి ఉండే ప్రాముఖ్యత దానికి ఉంటూనే రెండింటికీ మధ్య విడదీయరాని ఒక అనుబంధం ఉంటుంది.

మీరు సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నారా?? అయితే సంతోషానికి చాల దగ్గరలో ఉన్నారన్నమాటే..

సంగీతం, డాన్స్ రెండూ నేర్చుకోవాలని అనుకుంటే, ఇక ఆకాశమే హద్దు.. 

సంగీతం:

సంగీతం ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవడానికి శ్రీ. పురందరదాసు ఒక ప్రాథమిక పద్ధతిని 500 సంవత్సరాలకు పూర్వమే సమకూర్చారు, దానినే మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాం. ఆయన సంగీతంలో చేసిన సేవలకు గాను ఆయనని “కర్ణాటక సంగీత పితామహా” గా కొనియాడుతున్నాము.

మనం నేర్చుకొనే ఆ ప్రాథమిక విధానం:

సరళీస్వరాలు జంట స్వరాలు  అలంకారాలు హెచ్చు స్థాయి స్వరాలు గీతాలు స్వరజతులు.

ఇవి నేర్చుకున్నాక వర్ణాలు’, దాని తరువాత కృతులు నేర్చుకుంటాం.

ఇవన్నీ నేర్చుకొని మనం సంగీతం మీద పట్టు సాధించడానికి కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేయాల్సివస్తుంది.

స్వరాలు ఏడు అక్షరాలను కలిగి ఉంటాయి. అవి “స-రి-గ-మ-ప-ద-ని” వీటినే సప్త స్వరాలు అని కూడా పిలుస్తాం. సప్త అంటే ఏడు అని అర్థం. 

Sarali Swaralu Steps
స్వర స్థానం
SaraLi Swaralu
స్వరాలు
ఆరోహణ:

తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి – ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ‘ఆరోహణ’ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జమం నుండి తారా స్థాయి షడ్జమం వరకు.Sarali Swaralu Example

అవరోహణ:

ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి – తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ‘అవరోహణ’ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జమం నుండి మధ్యమ స్థాయి షడ్జమం వరకు.

Sarali Swaralu Example* తారా స్థాయి స్వరాలను పైన చుక్క (.) తో గుర్తిస్తాం.

మొదటిగా మనం నేర్చుకునేది సరళీస్వరాలు, ఇవి 15వ మేళకర్త రాగమైన ‘మాయామాళవగౌళ’ రాగం, ఆదితాళం (క్రియలు – 8) లో పాడతాం.

ఈ క్రింద నేను ఇచ్చిన నోట్స్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

Click here for Pdf సరళీస్వరాలు

Click here for English

చిట్క:

పైన ఇచ్చిన 15 ఒక్కొక్కటి కాకుండా 1 – 15 అన్ని కలిపి ఒకేసారి మొదటి కాలంలో, తరువాత రెండవ కాలంలో, చివరిగా మూడవ కాలంలో పాడి చూడండి. ఇలా పాడడం వలన మీరు సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతారు.

ఈ విధంగా పాడి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి.

జంట స్వరాల్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.

పాటలు                                                                                 జంట స్వరాలు

కర్నాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే👇🏻 సంప్రదించండి..

ఇమెయిల్: sudheer.anjali@gmail.com

What’s app Number: +91 99662 00544.

నేను కూచిపూడి డాన్స్ నేర్పిస్తాను మరియు వివిధ భాషలకు సంబంధించిన పాటల మీద కూడా డాన్స్ నేర్పిస్తాను. మీ ఆఫీస్ లేదా పర్సనల్ సెలెబ్రేషన్స్, సంగీత్, పెళ్లి, గర్బా, కోలాటం, స్కూల్/కాలేజీ వార్షికోత్సవాలలో పాల్గొనాలనుకుంటున్నారా?? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సంప్రదించగలరు.

ధన్యవాదాలు